క్రిష్ణగాడి వీరప్రేమకథ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మెహరీన్.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించి నటిగా మంచి భవిష్యత్తు ఉందని ప్రూవ్ చేసుకుంది.తరువాత తెలుగులో మెహరీన్ కి వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి.
అయితే కమర్షియల్ సినిమాలు స్టార్ హీరోలతో చేసే అవకాశం వచ్చిన అమ్మడుకి వరుస ఫ్లాప్ లు వరించాయి.వరుస డిజాస్టర్స్ తో ఈ భామ కెరియర్ అయిపొయింది అనుకునే సమయంలో రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది.
తరువాత ఎఫ్2లో మంచి కామిక్ రోల్ పోషించి అందరిని నవ్వించింది.ప్రస్తుతం ఎఫ్౩ మూవీలో మెహరీన్ నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య మెహరీన్ తన ప్రియుడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే.ఇక తన పెళ్లి గురించి, పెళ్లి తర్వాత సినిమా కెరియర్ గురించి ఈ భామ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
రెండు రోజుల పాటు తమ వివాహం జరగనుందని చెప్పుకొచ్చిన మెహ్రీన్ ముందుగా పంజాబీ శైలిలో గురుద్వార్ వేదికగా జరగనుందని పేర్కొంది.అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుందని స్పష్టం చేసింది.
ఇక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనే దానిపై కూడా మెహ్రీన్ క్లారిటీ ఇచ్చింది.పెళ్లయ్యాక కూడా తప్పక సినిమాలలో నటిస్తాను.
నన్ను అర్ధం చేసుకునే భర్త దొరికినందుకు సంతోషిస్తున్నాను.పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను.
పెళ్లయ్యాక ఢిల్లీకి మకాం మారుస్తాను అంటూ మెహ్రీన్ కౌర్ పేర్కొంది
.