ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ ( Adipurush )నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.గత కొన్ని వారాలుగా అదుగో ఇదుగో అంటూ ఎదురు చూస్తూ వస్తున్న ఆదిపురుష్ బెనిఫిట్ షో లతో నేడు తెల్లవారక ముందే ఆట పడిపోయింది.
రామాయణ ఇతివృత్తంతో రాముడిగా ప్రభాస్ ( Prabhas )నటించిన ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూశారు.ప్రమోషన్ చేయకున్నా కూడా సాధ్యం అయినంత ఎక్కువ భారీ వసూళ్లు సాధ్యం అంటూ అంతా నమ్మారు.
కానీ సినిమా ఫలితం పట్ల కొందరు అభిమానులు పెదవి విరుస్తున్నారు.ఫస్ట్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ సరిగా లేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అప్పుడే సినిమా గురించి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేసుకుంటున్నారు.ఆహా ఓహో అన్నట్లుగా ఉంటుంది అంటూ ప్రచారం చేసిన వారు కాస్త ఇప్పుడు అయ్యో అన్నట్లుగా పెదవి విరుస్తున్నారు.

మొత్తానికి దర్శకుడు ఓం రౌత్( Om Raut ) సెకండ్ హాఫ్ విషయంలో పూర్తిగా విఫలం అయ్యాడు అన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.బాహుబలి గా ఎలా అయితే ప్రభాస్ ఆకట్టుకున్నాడో రాముడి పాత్ర లో కూడా ప్రభాస్ ఆకట్టుకున్నాడు.రాముడి పాత్ర అంటే ఒకప్పుడు ఎన్టీఆర్.ఆ తర్వాత బాలయ్య లు మాత్రమే చేయగలరేమో అని అంతా అనుకున్నారు.

కానీ ప్రభాస్ కూడా రాముడి పాత్రలో జీవించాడు.ఈసారి మరింత ప్రత్యేకంగా రామాయణం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సెకండ్ హాఫ్ విషయంలో ఇప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ నుండి ఒక స్పష్టమైన టాక్ రాలేదు.ఎవరికి వారు నెగటివ్ గా చెబుతున్నారు.కానీ పూర్తి రివ్యూలు వస్తే కానీ అసలు విషయం చెప్పలేం.మరికాసేపట్లో పూర్తి రివ్యూలు రాబోతున్నాయి.
అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.