ఐడియల్ డిగ్రీ కళాశాలలో అలరించిన ఐడియల్’ రిథమ్‘ కల్చరల్ ఫెస్ట్.విశిష్ట అతిథిగా విచ్చేసిన నంది అవార్డు గ్రహీత మెగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.విద్యార్థులకు” జోష్’ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ మాటలు.ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం చేసిన కళ్యాణ్ కృష్ణ.
మెమొంటో అందజేసి దుస్సాలువతో కురసాలను కళాశాల తరఫున ఘనంగా సత్కరించిన పారిశ్రామికవేత్తలు.కళాశాల అంతా కేరింతలే.కేరింతలు…
కాకినాడ రూరల్… ఎంత ఎదిగిన సింపుల్ సిటీ డౌన్ టు ఎర్త్ గా ఉండటమే నా హాబీ అని ఐడియల్ కళాశాలలో విద్యార్థులు అడిగిన ప్రశ్నకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు వారి సోదరుడు సినీ డైరెక్టర్ నంది అవార్డు గ్రహీత కురసాల కళ్యాణ్ కృష్ణ సూచించారు .స్థానిక విద్యుత్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో ఐడియల్ రిథమ్ టెక్నికల్ అండ్ కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమం రెండు రోజులు పాటు జరిగాయి.ఆఖరి రోజు మెగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ విశిష్ట అతిథిగా పాల్గొని ఐపీఎల్ (ఐడియల్ ప్రీమియంలీగ్) క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో విజేతలకు కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా షీల్డ్ 10,000 రూపాయల నగదు ప్రథమ బహుమతిగా అందజేశారు.ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ యూత్ ఆటలతో పాటు చదువుపై కూడా శ్రద్ధ పెట్టి పెద్ద స్థాయిలోకి ఎదిగి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఐడియల్ డిగ్రీ కళాశాలలో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రొఫెషనల్ కోర్సులు నేటి యువతకు ఎంతో అవసరం అన్నారు.ఆటలు ఆడాలన్న, పాటలు పాడాలన్న ఈ వయసులోనే చేయాలని మేము కూడా మీలాగే అల్లరి చేసే వారము అని కళ్యాణ కృష్ణ అన్నారు .విద్యార్థులతో మాట్లాడిన మాటలకు కళాశాల అంతా కేరింతలతో నిండిపోయింది.అనంతరం కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పి.
చిరంజీవిని కుమారి, జాయింట్ సెక్రెటరీ పి.కిరణ్, కళాశాల డైరెక్టర్స్ వాసు కొప్పిశెట్టి ,రంజిత్ మెర్ల , కురసాల కళ్యాణ్ కృష్ణకు కళాశాల తరఫున ఎస్ జి ఎస్ ఆక్వా కల్చర్ అధినేత మధుమోహన్, శ్రీమతి పద్మావతి దంపతులు దుస్సాలువ తో ఘనంగా సత్కరించగా, ప్రముఖ పారిశ్రామికవేత్త” క్రీఫే’ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అధినేత కృష్ణారెడ్డి మొమెంటో అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐడియల్ డిగ్రీ కళాశాల లెక్చరర్స్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.