టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఒక స్టార్ హీరోతో ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే ఆ వార్తల గురించి స్పందించడానికి రష్మిక ఇష్టపడలేదు.
అయితే తాజాగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడిన ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఛలో సినిమాతో తెలుగునాట నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా పాపులారిటీని సంపాదించుకున్నారు.
సరిలేరు నీకెవ్వరు, దేవదాస్, గీతా గోవిందం సినిమాలు నటిగా రష్మికకు క్రేజ్ ను పెంచాయి.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా రష్మికకు నటిగా మంచి గుర్తింపు ఉంది.
ప్రేమ గురించి రష్మిక మాట్లాడుతూ మాటల్లో ప్రేమను వర్ణించడం సాధ్యం కాదని అన్నారు.ప్రేమ అనేది భావ వ్యక్తీకరణ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఒకరికొకరు గౌరవం, సమయం ఇచ్చి పుచ్చుకుంటే మాత్రమే అది లవ్ అవుతుందని రష్మిక తెలిపారు.
పెళ్లి గురించి రష్మిక స్పందిస్తూ తన వయస్సు పెళ్లి గురించి మాట్లాడే వయస్సు కాదని ఆమె అన్నారు.తన మనస్సులో పెళ్లికి సంబంధించిన ఆలోచన కూడా లేదని ఆమె కామెంట్లు చేశారు.తనను సురక్షితంగా చూసుకునే వాళ్లను మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతానని ఆమె అన్నారు.
రష్మిక మందన్న చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రష్మికను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.
రష్మిక నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఈ నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.పుష్ప ది రూల్ లో రష్మిక నటిస్తుండగా ఈ ఏడాదే ఆ సినిమా కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.వరుసగా సినిమాల్లో నటిస్తూ రష్మిక టాలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు.