పేక మేడలు కట్టి ఏకంగా గిన్నిస్ రికార్డ్ సాధించాడు!

అవును, మీరు విన్నది నిజమే.సాధారణంగా పేకతో ఎవరన్నా ఎక్కువగా ఆటలు అడితే వ్యసనపరులు అంటారు.

 Indian Teen Sets World Record By Building Largest Structure With Cards Details,-TeluguStop.com

అలాంటి ముక్కలతో మనోడు ఏకంగా గిన్నిస్ రికార్డ్( Guinness Record ) సాధించాడు.మనవాళ్లు సందర్బం వచ్చినపుడు గాల్లో పేక మేడలు కట్టొద్దు అంటూ వుంటారు.

కానీ అదే పేక మేడలు కట్టి రికార్డ్స్ సృస్టించాడు.ఇక పేక ముక్కలతో మెజిషియన్స్ కూడా ఎన్నో రకాల విన్యాసాలు చేస్తుంటారు.

పేకతో ఎన్నో కళాత్మక రూపాల్ని క్రియేట్ చేయొచ్చు.అది వారిలో ఉండే క్రియేటివిటీకి అద్దం పడుతుంది.

అటువంటి కళతోనే ఓ కుర్రాడు పేకముక్కలతో ఏకంగా ప్యాలెస్ కట్టేశాడు.దాంతో గిన్నిస్ రికార్డు వరించింది.

కోల్ కతాకు చెందిన “అర్నవ్ డాగా”( Arnav Daga ) అనే 15 ఏళ్ల కుర్రాడు పేక ముక్కలతో అద్భుతమైన ప్యాలెస్ ( Palace ) నిర్మించి ఔరా అనిపించదు.ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 11 అడుగుల ఎత్తు 16అంగుళాల వెడల్పు కలిగిన ప్యాలెస్ నిర్మించాడు.

ఆ ప్యాలెస్ పొడవు 40 అడుగులు కావటం విశేషం.దాదాపుగా 41 గంటలకు పైగా కష్టపడి ఈ క్రియేటివిటీని పూర్తిచేశానని అర్నవ్ చెప్పుకొచ్చాడు.పేక ముక్కలతో ఎన్నో రకరకాల భవనాలను నిర్మించాడు.ప్రతీ నిర్మాణానికి రికార్టు కొట్టటం ఆర్నవ్ ప్రత్యేకత.

అర్నవ్ పేకముక్కలతో( Cards ) పొడవు 34 అడుగుల 1 అంగుళం, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో మూడు మకావూ హోటళ్ల ప్రతిరూపాలను( Macao Hotels ) సృష్టించి రికార్డులకెక్కాడు.ఇదే క్రమంలో తాజాగా అర్నవ్ పేకముక్కలతో నిర్మించిన అద్భుతమైన భవన నిర్మాణానికి గిన్నిస్ రికార్డు వరించింది.అర్నావ్ సాధించిన ఈ రికార్డుతో గతంలో బ్రయాన్ బెర్గ్ పేరుతో ఉన్న పేక మేడల రికార్డు తుడుచుపెట్టుకు పోయింది.ఇకపోతే అర్నవ్ డాగా 10th క్లాస్ చదువుతున్న ఓ విద్యార్ధి.

పేకమేడ కట్టటం( Cards Building ) అంత తేలిక కాదని, కానీ తనకు పేకతో నిర్మాణాల రూపాలు క్రియేట్ చేయటం ఇష్టమని ఆ ఇష్టమే తనకు గిన్నిస్ రికార్డు తెచ్చి పెట్టిందని చెబుతున్నాడు.ఓ సాధారణ హాబీని కరోనా లాక్ డౌన్ టైమ్ లో సీరియస్ గా తీసుకున్నానని గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడనని తెలిపాడు.ఈ పేకముక్కలతో నిర్మాణం చేయటానికి మొదట్లో తాను చాలా తెలుసుకున్నానని అలా తన సాధనతో గిన్నిస్ రికార్డు సాధించానని తెలిపాడు.ఈ రికార్డు కోసం గత ఏడాది యత్నించి విఫలమయ్యానని కానీ నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంతో సాధన చేసి తాను అనుకున్నది సాధించగలిగానని ఆర్నవ్ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube