టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నందమూరి తారక రామారావు మనవడిగా అడుగుపెట్టి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్( NTR ) ఒకరు.బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన అనంతరం హీరోగా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా( RRR Movie )కు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడంతో ఈయనకు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ( Devara Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా తెలుగు సినిమాలతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ఓల్డ్ వీడియో వైరల్ గా మారింది.జయప్రద వ్యాఖ్యతగా వ్యవహరించినటువంటి కార్యక్రమానికి ఈయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడగడంతో వాటికి ఎన్టీఆర్ కూడా అలాగే సమాధానాలు చెబుతూ వచ్చారు.
ఈ క్రమంలోనే జయప్రద ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ మీకు కనక ఒకేసారి నందమూరి హరికృష్ణ గారు బాలకృష్ణ ( Balakrishna ) గారు తమ సినిమాలలో నటించమని డేట్స్ ఇస్తే మీరు ఏ హీరోకి అవకాశం ఇస్తారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా తాను తప్పకుండా హరికృష్ణ( Hari Krishna ) గారికి డేట్స్ ఇస్తానని సమాధానం చెప్పారు.హరికృష్ణ అంటే ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే.తండ్రి అంటే ఎంతో అమితమైన ప్రేమ ఉన్నటువంటి ఎన్టీఆర్ తన తండ్రికే అవకాశం ఇస్తాను కానీ బాలయ్యకు అవకాశం ఇవ్వను అంటూ చెప్పినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే హరికృష్ణకు ఎన్టీఆర్ రెండవ భార్య కుమారుడు కావడంతో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈయనని మొదటి నుంచి దూరం పెడుతూనే వచ్చారు.ఇక బాలకృష్ణకు ఎన్టీఆర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత విభేదాలు కూడా ఉన్నాయని విషయం మనకు తెలిసిందే.

తన తండ్రి హరికృష్ణ గారు బ్రతికి ఉన్నప్పుడు బాలయ్య( Balakrishna ) ఎన్టీఆర్ సినిమా ఈవెంట్లకు హాజరైనప్పటికీ ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ ఎదురుగా కనిపించిన మాట్లాడని పరిస్థితులు ఎదురయ్యాయి ఎన్టీఆర్ ను బాలకృష్ణ ఎప్పటికప్పుడు దూరం పెడుతూనే వచ్చారు.ఇలా బాలయ్య తనని దూరం పెడుతున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూనే వచ్చారు.కానీ నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ కి మాత్రం సరైన గౌరవం దక్కలేదని ఎప్పటికప్పుడు తనని అవమానిస్తూనే ఉన్నారని చెప్పాలి.ఇలా ఆయన ఒకప్పుడు ఎన్నో అవమానాలను ఎదురుకోవడంతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు( Chandrababu Arrest ) అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారని తెలుస్తుంది.







