1.కెసిఆర్ పై కేంద్ర మంత్రి విమర్శలు
రెండున్నర లక్షల కోట్ల అప్పుపై తెలంగాణ ప్రజలకు కేసిఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.
2.హెచ్ఐసిసి, నోవాటెల్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నం
హెచ్ఐసిసి, నోవాటెల్ మొట్టడికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు.
దీంతో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే సమయంలో అడ్డుకోవడానికి యూత్ కాంగ్రెస్ సన్నాహాలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
3.కెసిఆర్ కు మోదీ ప్రశ్న
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటైనా అమలు చేశారా ? చేస్తే ఏం చేశారో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ ని తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. 4.దోపిడి దొంగతో మోడీకి వినూత్న నిరసన హైదరాబాద్ వనస్థలిపురంలోని పెట్రోల్ బంక్, బ్యాంకుల ముందు వినూత్న రీతిలో ఒక దోపిడీ దొంగ వేషంలో ఒక వ్యక్తి ప్లకార్డులతో దర్శనమిస్తున్నారు.ఆ ప్లకార్డ్ లో మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటే నువ్వు ఏకంగా దేశాన్ని దోచేశావు అని రాసి ఉంది.
5.మరోసారి సెలవుల్లోకి జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
మరోసారి జిహెచ్ఎంసి ఎంఫోర్స్మెంట్ అధికారులు సెలవుల్లోకి వెళ్లారు. నగరంలో భారీగా టిఆర్ఎస్ బీజేపీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో వీరు సెలవులు పెట్టడం చర్చనీయాంశం అంశం అవుతుంది.
6.యశ్వంత్ సిన్హా కు ఘన స్వాగతం
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బేగంపేట విమానాశ్రయంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నాయకులు స్వాగతం పలికారు.
7.భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీ బందో బస్తు
పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో ఈ స్థాయిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
8.రేపు పలు ఎంఎంటిఎస్ సర్వీసుల రద్దు
హైదరాబాద్ నగరంలోని వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే పలు ఎంఎంటిఎస్ రైళ్లను ఈనెల మూడో తేదీన రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
9.నేడు సడక్ బంద్ కు ఎమ్మార్పీఎస్ పిలుపు
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో సడక్ బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
10.బస్సులను శుభ్రం చేస్తూ టిడిపి వినూత్న నిరసన
ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు , ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సులు కడిగి నిరసన వ్యక్తం చేశారు.
11.ప్రధాని లోక్ సభ స్పీకర్ కు లేఖ
అల్లూరి 125వ జయంతి వేడుకలు సందర్భంగా పార్లమెంటులో సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ కి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
12.వల్లభనేని వంశీకి కరోనా
గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
13.రేపు జనవాణి జనసేన
రేపు జనవాణి జనసేన పేరుతో భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్ తెలిపారు.
14.ఆర్టీసీ చార్జీల పెంపు పై వామపక్షాల ఆందోళన
ఏపీలో ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి.
15.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.కేటీఆర్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం
టిఆర్ఎస్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి స్థానంలో ఉన్న కేటీఆర్ భాష సరిగా లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
17.ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా
ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కు కరోనా సోకింది.
18.అగ్నిపథ్ రద్దు చేయాలి : జగ్గారెడ్డి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్ని పథ్ స్కీమ్ ను రద్దు చేయాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
19.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2022 -23 సంవత్సరానికి డిగ్రీ , పీజీ, ఈజీ డిప్లమో మరియు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,000 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,340
.