యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.ఆ మూడు సినిమాలు కూడా బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాలు.
ఈ మూడు సినిమాల బడ్జెట్ అంతా వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.ఈమూడు సినిమాలు కూడా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టిని మాత్రమే కాకుండా యావత్ దేశం మొత్తం మీద ఉన్న సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
రాధేశ్యామ్ విషయానికి వస్తే షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది.కరోనా వల్ల సినిమా షూటింగ్ నిలిచి పోయింది.
మళ్లీ యూరప్ వెళ్లి షూటింగ్‌ను ముగించేందుకు సిద్దం అవుతున్నారు.అందుకు సంబంధించిన సన్నాహాల్లో దర్శకుడు రాధాకృష్ణ ఉన్నాడు.
ఆ సినిమా పూర్తి అయిన తర్వాత వచ్చే జనవరి నుండి ఆదిపురుష్ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికే ఏర్పాట్లు చకచక చేస్తున్నాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో ప్రభాస్ ను రాముడిగా చూపిస్తూ ఈ సినిమాను ఓం రౌత్ తెరకెక్కించబోతున్నాడు.
ఆదిపురుష్ సినిమా కంటే ముందు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాను ప్రకటించాడు.ఇదో పాన్ వరల్డ్ మూవీ అంటూ ఇప్పటికే నాగ్ అశ్విన్ ప్రకటించాడు.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ విషయంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు ఇప్పటికే వైజయంతి మూవీస్ భారీగా నిధులు సేకరించే పనిలో కూడా ఉంది.
అయితే ఈ రెండు సినిమాల విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది.రాధేశ్యామ్ వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇక నాగ్ అశ్విన్ మూవీ మరియు ఆదిపురుష్ చిత్రాల విషయాల్లో ఉన్న సస్పెన్స్ ను కొందరు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.అందులో భాగంగా ప్రభాస్ రెండు సినిమాలు కూడా 2022లో ఖచ్చితంగా విడుదల అవుతాయి.
అందులో ఒక సినిమాను ఆ ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనుండగా మరో సినిమాను దసరా సీజన్‌లో విడుదల చేయబోతున్నారు.అంటే రెండు సినిమాలకు కూడా కేవలం నాలుగు నెలల సమయం ఉంటుందని అంటున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇదో పెద్ద గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.