గోపీచంద్, రాశి ఖన్నా జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘జిల్’.ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే.తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.
అయినా కూడా ఈ సినిమాకు ముందు వచ్చిన ‘లౌక్యం’ సక్సెస్ అవ్వడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.దాదాపు 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ వచ్చినట్లు తెలుస్తోంది.
విడుదలైన మొదటి వారం రోజుల్లోనే 10 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమాకు ఆన్‌లైన్ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా మరో 6 కోట్ల రూపాయలను దక్కించుకుంది.మొత్తంగా ఈ సినిమా మొదటి పది రోజుల్లోనే నిర్మాతలను సేఫ్ జోన్‌లో పడేసింది.
గోపీచంద్ స్టైలిష్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.రాశి ఖన్నా తన గ్లామర్‌తో మెప్పించింది.
విడుదలైన ఇన్ని రోజులకు కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.‘సన్నాఫ్ సత్యమూర్తి’ వచ్చే వరకు ఈ సినిమాకు నిలకడగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి.