నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా... అయితే ఈ చిట్కాలు మీ కోసమే

మనం ప్రతి రోజు ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు మొదలైన వాటి కారణంగా సరైన నిద్ర పట్టదు.నిద్ర సరిగా పట్టకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

 Effective Remedies To Get Good Sleep Details, Good Sleep, Effective Remedies, Ch-TeluguStop.com

అలాగే రోజంతా ఉత్సాహం లేక నిరుత్సాహంగా ఉంటుంది.ఇది నిద్రలేమికి దారి తీసి ఒక్కోసారి డిప్రెషన్ కి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

అందుకే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే నిద్ర బాగా పడుతుంది.

చెర్రీ పండ్లలో మెలటోనిన్ సమృద్ధిగా ఉండుట వలన నిద్ర పట్టటంలో బాగా సహాయాపడుతుంది.

రాత్రి పడుకొనే ముందు చెర్రీ పండ్లను తినటం లేదా జ్యుస్ త్రాగటం గాని చేస్తే మంచి నిద్ర పడుతోంది.

రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను త్రాగితే నిద్ర పడుతోంది.

పాలలో ఉండే న్యూరో ట్రాన్స్‌మీటర్స్ నిద్ర పట్టేలా చేసి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.

రాత్రి భోజనంలో పెరుగు తీసుకున్న మంచి నిద్ర పడుతుంది.

పెరుగులో ఉండే ట్రిప్టోఫాన్ నిద్ర రావటానికి దోహదం చేస్తుంది.

Telugu Banana, Cherry Fruits, Curd, Effective, Sleep, Sleeplessness, Tips Sleep,

రాత్రి సమయంలో అరటిపండ్లను తింటే నిద్ర బాగా రావటమే కాకుండా ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.అలాగే రక్త సరఫరా మెరుగుపడి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

బాదం పప్పులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది.

ఇది కండరాలు, మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తుంది.దీంతో చక్కని నిద్ర వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube