సాధారణంగా అందంగా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో పనికొస్తారు.హీరో అయినా, హీరోయిన్ అయినా ఎంతో కొంత గ్లామర్ ఉండాల్సిందే.
అయితే గ్లామర్ తో మొదట ఇండస్ట్రీకి వచ్చిన యాక్టింగ్ తో కూడా ప్రూవ్ చేసుకుంటేనే అదృష్టం కూడా కలిసి వచ్చి సినిమాలు పడతాయి.అలాగే వారి రేంజ్ కూడా పెరుగుతుంది.
మామూలుగా ఎవరికైనా యుక్త వయసు అంటే 20 నుంచి 30 లేదా 35 వరకు అనుకోవచ్చు.కానీ 45 ప్లస్ ఏజ్ లో కూడా ఎంతో అందంగా, హ్యాండ్సమ్ గా కనిపించే కొంత మంది సౌత్ ఇండియన్ హీరోలు నేటి కుర్ర హీరోల కన్నా కూడా చాలా బెస్ట్ లుక్స్ తో కనిపిస్తారు.
మరి ఆ హీరోలు ఎవరు ? వారి వయసెంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మహేష్ బాబు
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అయిన మహేష్ బాబు( Mahesh Babu ) వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు.
ఆయన కూడా 20 ఏళ్ల హీరో లాగా తన లుక్స్ తో అందరిని మంత్ర ముగ్ధులను చేస్తూ ఉంటాడు.తన అందం ముందు హీరోయిన్స్ సైతం చిన్న పోతారు.
అలా మెయింటైన్ చేస్తూ ఉండడానికి మహేష్ బాబు చాలానే కష్టపడతాడట.
సూర్య
ఈ హీరో వయసు సైతం మహేష్ బాబు లాగా 47 సంవత్సరాలు.కానీ సూర్య( Surya ) ఇప్పటికి చాలా స్టైలిష్ గా, అందంగా ఉంటాడు.ఇంకా 20 ఏళ్ల పాటు సినిమాలో తీస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒక్కోసారి సూర్యకి వయసు పోతుందా వస్తుందా అని అనుమానం కూడా వస్తుంది.
విజయ్ కుమార్
దళపతిగా విజయ్ ( vijay )కోలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా మొత్తం మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు మాస్ అండ్ కమర్షియల్ హీరోగా విజయ్ కి మంచి పేరు ఉంది.అంతే కాదు ప్రస్తుతం విజయ్ వయసు 49.కానీ 20 ఏళ్ల హీరోలతో పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నాడు.విజయ్ కి కోలీవుడ్ లో ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉంటుంది.