వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారా.? కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడమే కాకుండా రోజు చెమటలు చిందేలా వర్కౌట్స్ చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ హెర్బల్ టీను రోజు నైట్ తాగితే వెయిట్ లాస్ ( Weight loss )తో సహా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
మరి ఇంతకీ ఆ హెర్బల్ టీను( Herbal tea ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు దంచిన యాలకులు, రెండు లవంగాలు, ( Clove 0అంగుళం దాల్చిన చెక్క, పావు టేబుల్ స్పూన్ జాజికాయ, ( Nutmeg )హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము ( Grate ginger )వేసుకుని మరిగించాలి.దాదాపు 8 నుంచి పది నిమిషాల పాటు వాటర్ ను హీట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన దేశీయ నెయ్యి మరియు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపితే మన హెర్బల్ టీ రెడీ అయినట్లే.రోజు నైట్ ఈ టీను ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.ఆరోగ్యపరంగా ఈ హెర్బల్ టీ చాలా మేలు చేస్తుంది.
ముఖ్యంగా వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది.ప్రతిరోజు నైట్ ఈ హెర్బల్ టీను తాగితే శరీరంలో అధిక కేలరీలు వేగంగా కరుగుతాయి.
దీంతో సులభంగా వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఈ హెర్బల్ టీ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే పొట్ట వద్ద బెల్లీ ఫ్యాట్ సమస్య దూరం అవుతుంది.
రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దెబ్బకు పరార్ అవుతాయి.
బాడీ డీటాక్స్ అవుతుంది.ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది.
అలాగే ఇటీవల రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.అయితే ఈ హెర్బల్ టీ నిద్రలేమిని నివారించడానికి సహాయపడుతుంది.
రోజు నైట్ ఈ టీ తాగితే చక్కటి నిద్ర పడుతుంది.







