ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవనశైలి ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తుంది.అంతేకాకుండా ప్రస్తుత సమాజంలో చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల మధుమేహం వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.
వీటిలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి అని నిపుణులు చెబుతున్నారు.ఈ సమస్య పురుషుల కంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ఇది జన్యుపరమైన సమస్య.కాబట్టి ఇంట్లో ఎవరికైనా థైరాయిడ్ ఉంటే పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
దీనికి శాశ్వత చికిత్స అనేది లేదు.మీరు మందులు తీసుకోవడం, మీ జీవన శైలి మార్చుకోవడం వల్ల దీన్ని నివారించవచ్చు.

థైరాయిడ్ సమస్య( Thyroid )తో బాధపడుతున్న వారు ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.ముఖ్యంగా చెప్పాలంటే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు వేరు శనగకు దూరంగా ఉండడమే మంచిది.వేరు శనగలో గోయిట్రోజెన్ ఉంటుంది.దీనికి కారణంగా హైపోథైరాయిడిజం పరిస్థితి మరింత దిగజారిపోతుంది.ఇంకా చెప్పాలంటే రాగుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.కాబట్టి దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిదే.
కానీ ఇందులో ఉండే గోయిట్రోజెనిక్ ఫుడ్ కారణంగా నానబెట్టి సరిగా ఉడికించిన తర్వాత నెలకు రెండు నుంచి మూడుసార్లు తీసుకుంటూ ఉండాలి.

ఇంకా చెప్పాలంటే బాదం పప్పులో సేలినియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.ఇవి థైరాయిడ్ పని తీరుకు చాలా మేలు చేస్తాయి.కానీ బాదం అనేది గోయిట్రోజెనిక్( Goitrogenic ) ఆహారం.
కాబట్టి దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఈ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు.అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు మూడు నుంచి ఐదు బాదం గింజలను నానబెట్టి తీసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే గోధుమలో గ్లూటెన్ ఉంటుంది.ఇది సంభావ్య గాయిట్రోజెనిక్ ఆహారం.
ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజం విషయంలో గోధుమ తీసుకోవడం తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు.గ్లూటెన్( Gluten ) రహిత ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు వారి రక్తంలో ప్రతిరోధకాల సాంద్రతను తగ్గిస్తారని, ఇది థైరాయిడ్ గ్రంథికి మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు.







