బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కీలక నేత ఆది శ్రీనివాస్( Adi Srinivas ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ తమ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.
ఇంకా అధికారంలో ఉన్నామనే పొగరుతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు.
గతంలో ఖమ్మంలో రైతుల( Khammam ) చేతులకు బేడీలు వేసిన బీఆర్ఎస్( BRS party ) తమను రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.మేడిగడ్డను బీఆర్ఎస్ నేతలే ధ్వంసం చేశారని ఆరోపణలు చేశారు.చిల్లర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ విషయంలో రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.