బంగారం వర్ణంలో ముఖం( Golden Glow Skin ) అందంగా మెరిసిపోవాలని కొందరు కోరుకుంటారు.అయితే గోల్డెన్ గ్లో స్కిన్ కోసం బ్యూటీ పార్లర్ లో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
ఇంట్లోనే అటువంటి చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా తోడ్పడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక చిన్న సైజ్ క్యారెట్( Carrot ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్,( Orange Peel Powder ) వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకొని కలుపుకోవాలి.
చివరిగా సరిపడా ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ వేసుకుని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ రెమెడీని కనుక పాటించారంటే గోల్డెన్ గ్లో స్కిన్ మీ సొంతం అవుతుంది.
పైగా ఈ హోమ్ రెమెడీ సూర్యరశ్మి నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.
అంతేకాకుండా ఈ రెమెడీ మృత చర్మ కణాలను సున్నితంగా తొలగించి, మృదువైన చర్మాన్ని అందిస్తుంది.ఆరెంజ్ పీల్ పౌడర్ లోని సిట్రిక్ యాసిడ్ మీ చర్మాన్ని కాంతివంతంగా మరియు అందంగా మెరిపిస్తుంది.మొండి మచ్చలను సైతం వదిలిస్తుంది.