మాతృత్వం అనేది ఆడవారికి మాత్రమే దక్కిన వరం.తమ నుంచి మరో ప్రాణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో ఆడవారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు.
అమ్మ అన్న పిలుపు కోసం శరీరంలో వచ్చే అన్ని మార్పులను స్వీకరిస్తారు.బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ప్రెగ్నెన్సీ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే గర్భధారణ( Pregnancy ) సమయంలో పండ్లు( Fruits ) తినడం చాలా ముఖ్యం.ఎందుకంటే అవి విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.
ఇవి తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడతాయి.ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు కచ్చితంగా తినాల్సిన కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరెంజ్:
గర్భిణీ స్త్రీలు హైడ్రేటెడ్ గా ఉండటానికి ఆరెంజ్( Orange ) సహాయపడుతుంది.ఆరెంజ్ లో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ మరియు ఫోలేట్ ఉంటాయి, ఇవి శిశువు మెదడు, ఎముకలు మరియు వెన్నుపాము పెరుగుదల, అభివృద్ధికి మద్దతు ఇస్తాయి.
విటమిన్ సి మెండుగా ఉండటం వల్ల ఆరెంజ్ ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పని చేస్తుంది.
అరటి పండు:
గర్భిణీ స్త్రీలకు అరటిపండ్లు( Banana ) ఆరోగ్యకరమైన ఎంపిక అవుతాయి.అరటి పండ్లలో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి.విటమిన్ బి6 గర్భధారణ ప్రారంభంలో వికారం మరియు వాంతుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.ప్రెగ్నెన్సీ టైమ్ లో హార్మోన్ల మార్పుల వల్ల ఎసిడిటీ మరియు గుండెల్లో మంటకు దారితీస్తాయి.
అయితే అరటిపండ్లు ఆయా సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.అరటిపండులోని పొటాషియం మరియు ఫోలేట్ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ మరియు ఎముకల సక్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయి.
దానిమ్మ:
ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తినాల్సిన పండ్లలో దానిమ్మ( Pomegranate ) ఒకటి.దానిమ్మ అభివృద్ధి చెందుతున్న శిశువు మెదడును రక్షించడంలో సహాయపడుతుంది.దానిమ్మలోని పలు సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహింహిస్తాయి.ఇది అభివృద్ధి చెందుతున్న శిశువుకు పోషకాల పంపిణీకి తోడ్పడుతుంది.దానిమ్మపండులో అధిక ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ టైమ్ లో రక్తహీనత ఏర్పడకుండా ఉంటుంది.
జామ:
గర్భధారణ సమయంలో కొందరు మధుమేహానికి గురవుతుంటారు.ఆ రిస్క్ ను తగ్గించే సత్తా జామ పండ్లకు( Guava ) ఉంటుంది.జామ పండ్లలో ఉండే విటమిన్ సి శరీరం ఇనుమును గ్రహించడానికి సహకరిస్తుంది.రక్తహీనతను నివారిస్తుంది.ఇక వీటితో పాటు అవకాడో, బెర్రీస్, యాపిల్ పంటి పండ్లు కూడా గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి.