రాత్రి గురక సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటిస్తే రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు..!

రాత్రి సమయంలో చాలామంది గురక( Snoring ) పెడుతూ ఉంటారు.అయితే గురక పెట్టే వారికి బానే ఉంటుంది.

 Are You Suffering From Snoring Problem At Night..? But If You Follow These Tips-TeluguStop.com

ఎందుకంటే వాళ్లు గురక పెడుతున్నారనే విషయం వాళ్ళకి తెలిసి ఉండదు.కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం చాలా భరించాల్సి వస్తుంది.

వారికి రాత్రంతా నిద్ర ఉండదు జాగారమే జరుగుతూ ఉంటుంది.గురక పెడితే బాగా డీప్ స్లీప్ లో ఉన్నారని అనుకుంటారు.

కానీ దాన్ని తగ్గించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే సహజ సిద్ధంగా గురకని నయం కూడా చేసుకోవచ్చు.

అయితే గురకను నయం చేయడంలో సహాయపడే మార్గాలు కొన్ని ఉన్నాయి.వాటిని ఫాలో అయితే గురక తగ్గిపోతుంది.

ఇక రాత్రి హాయిగా నిద్రపోవచ్చు.

Telugu Eucalyptus Oil, Tips, Lavender Oil-Telugu Health

గురకని తగ్గించుకోవడానికి నూనెలు బాగా ఉపయోగపడతాయి.పెప్పర్మెంట్,యూకలిప్టస్, లావెండర్ నూనె( Lavender Oil )లో ఓదార్పు లక్షణాలు ఉన్నాయి.అందుకే వీటిని పడకగదిలో ఉంచితే మంచిది.

నూనె వాసన పీల్చడం వలన గురక నియంత్రించవచ్చు.లేదా నిద్రపోయే ముందు ఛాతి లేదా పాదాలకు రాసుకోవాలి.

ఇది సుగంధ ఆవిరి నాసిక భాగాలను క్లియర్ చేసి రద్దీ తగ్గిస్తుంది.అలాగే విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.

దీంతో ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేయడం వలన గురకను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి.

Telugu Eucalyptus Oil, Tips, Lavender Oil-Telugu Health

బరువుని అదుపులో ఉంచుకుంటే గురక కూడా అదుపులో ఉంటుంది.అలాగే ఆల్కహాల్, మత్తుమందులు లాంటివి నివారించాలి.అవి గొంతు కండరాలని సడలించి గురకని మరింత తీవ్రతరం చేస్తాయి.అలాగే తలకింద దిండు పెట్టుకొని పడుకుంటే కాస్త వరకు గురక తగ్గిపోతుంది.దీనివల్ల శ్వాస మార్గం తెరుచుకొని గురక నుండి ఉపశమనం లభిస్తుంది.గురకను ఎదుర్కోవడానికి ప్రకృతి మనకి శక్తివంతమైన మౌలిక ఔషధాలను అందిస్తుంది.

గుణాలు కలిగి ఉన్న మూలికలు తీసుకోవచ్చు.అయితే ఇవి నాసిక రద్దీనీ తగ్గిస్తాయి.

దీంతో సులభంగా శ్వాస తీసుకోవచ్చు.నిద్ర వేళకి ముందు ఈ మూలికలతో చేసిన హెర్బల్ టీ తాగడం( Tea ) వలన గురక నుండి ఉపశమనం పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube