సంతాన ప్రాప్తికి నవగ్రహాలు ఆటంకం ఎలా కల్గిస్తాయో తెలుసా?

మనకు తెలియకుండా మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా మనకు సంతానం కల్గకుండా ఉంటుందట.ఇందుకు నవగ్రహాలు తెగ ఆటంకాలు కల్గిస్తాయి.

 Do You Know How Navagrahas Create Problems In Fertility,  Navagraha , Pooja, Sar-TeluguStop.com

అయితే ఏ గ్రహం వల్ల ఎలా సంతాన సమస్యలు కల్గుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మన జాతకంలో సూర్యుడు సంతాన ప్రాప్తికి బాధాకారక గ్రహమైతే.

పితరులు, విష్ణువు, గురువుకు ద్రోహం చేయడం వల్ల శాపం చేత సంతానం కల్గదట.అలాగే చంద్రుడు బాధాకారక గ్రహం అయితే తల్లికి గాని తల్లితో సమానమైన స్త్రీకి గాని మనస్తాపం కల్గించడం వల్ల సంతాన ప్రాప్తి ఉండదట.

కుజుడు బాధాకారక గ్రహం అయితే సోదరులు, శత్రువుల ద్వారా, రుద్ర భగవానుడిని ఆరాధించకపోవడం వల్ల సంతాన ప్రాప్తికి ఆటంకం కల్గుతుంది.

బుధుడు బాధాకారక గ్రహం అయితే.

సరస్వతీ దేవిని పూజించకపోవడం వల్ల పిల్లులను, చేపలను చంపటం వల్ల సంతాన సమస్యలు వస్తాయట.గురువు బాధాకారక గ్రహం అయితే కుల గురువులను లేదా గురు సమానమైన వాళ్లను నిరాదరించడం, ద్రోహం చేయడం అలాగే ఫల వృక్షాలను నరకడం వల్ల పిల్లలు పుట్టరట.

శుక్రుడు బాధాకారక గ్రహమైతే.పుష్ప వృక్షాలను నరకడం, గోమాతను సేవించకపోవడం, యక్షిణీ శాపం కారణంగా సంతానం కల్గదు.

అలాగే శని బాధాకారక గ్రహం అయితే రావి చెట్టును నరకడం, పిశాచ బాధ, యమధర్మరాజు కారణంగా సంతాన సమస్యలు వస్తాయి.రాహువు బాధాకారక గ్రహం అయితే సర్ప శాపం వల్ల సంతానం కల్గదు.

కేతువు బాధాకారక గ్రహం అయితే బ్రాహ్మణ శఆపం వల్ల సంతాన ప్రాప్తికి ఆటంకం కల్గుతుంది.ఈ భాధాకారక గ్రహాలను ఉపశమింప చేయడానికి విధి విధానంగా శాంతి క్రియలు ఆచరించడం వల్ల దోషం పరిహారం అవుతుందని మన పెద్దలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube