ఆధ్యాత్మికతకు నిలువైన దేవాలయాలలో అనేక అద్భుతాలు, వింతలు, విశేషాలకు( miracles, strangeness, special things ) జరుగుతూ ఉంటాయి.తెలుగు రాష్ట్రాలతో సహా మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి.
వీటిలో కొన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పూజ్యనీయంగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి.మరికొన్నిటినీ రాజులూ, రాజ పోషకులు, జమీందారులు అభివృద్ధి చేయడంతో మహా మహిమానిత్వ క్షేత్రాలుగా ఇప్పటికీ విలసిల్లుతున్నాయి.
అలాంటి పుణ్యక్షేత్రంగా భక్తులతో పూజలను అందుకుంటున్న క్షేత్రం గుంటూరు జిల్లాలోని మంగళగిరి.ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి( Shri Lakshminarasimha Swamy ) వారు పానకలా స్వామి( Panakala Swami ) వారిగా ప్రసిద్ధి చెందారు.

అలాగే ఈ ప్రదేశం లో అనేక వింతలు, విశేషాలు ఉన్నాయి.గత కొంత కాలంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా దేవాలయం ఎదురుగా ఉన్న చీకటి కోనేటిని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ముఖ్యంగా చెప్పాలంటేపానకాల స్వామి దేవాలయంలో చీకటి కోనేరులో ఇప్పటికే అరుదైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీ వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం, వినాయక రాతి విగ్రహాలతో పాటు అద్భుతమైన కట్టడాలు కూడా బయటపడ్డాయి.

ఇప్పుడు తాజాగా పెద్ద కోనేరులో మరో అద్భుతాన్ని ఆలయ అధికారులు గుర్తించారు.ఈ కోనేరులో ( Koneru )అద్భుతమైన స్వరంగం కూడా బయటపడింది.ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ సొరంగం ఎంత దూరం ఉందన్న విషయాన్ని దేవాలయ అధికారులు ఇప్పటివరకు గుర్తించలేకపోయారు.
ఎందుకంటే ఈ సొరంగం పూర్తిగా బురదతో నిండి ఉండడం వల్ల ఈ స్వరంగం పొడవును గుర్తించడం వీలు కాలేదు.అలాగే స్వరంగం పొడవును అంచనా వేసి బ్రహ్మగుడి వరకు ఉండి ఉండొచ్చని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
అయితే ఈ సొరంగంలోని బురదను నీటిని తొలగిస్తున్నారు.పూర్తి స్థాయిలో బురదని తొలగించిన తర్వాత సొరంగంలోపల ఏముంది.
ఎక్కడ వరకు వెళ్లొచ్చు అన్న విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పానకాల స్వామి ఆలయ సిబ్బంది వెల్లడించారు.