ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల దేవస్థానానికి( Tirumala Temple ) ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే మరి కొంత మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.అలాగే తిరుమల లోని కళ్యాణ మండపాలలో( Tirumala Kalyana Mandapam ) వివాహం చేసుకోవాలని చాలా మంది భక్తులు అనుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం ఈ మండపాలలో వివాహం( Marriage ) చేసుకోవడానికి కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి వస్తుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో వివాహాల విషయంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో( Annamayya Bhavan ) నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది.ఈ మేరకు పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి( Bhumana Karunakar Reddy ) మీడియాకు తెలిపారు.అలిపిరి వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నామని భక్తులు తమకు ముఖ్యమైన రోజుల్లో స్వయంగా ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు.ఇదే సమయంలో టిటిడీ ఆధ్వర్యంలోని కల్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా సినిమా పాటలు, డీజే లకు ఆస్కారం లేదని చెబుతున్నారు.

అలాగే సినిమా, డీజే పాటలకు బదులుగా భక్తి గీతాలు, లలిత గీతాలను పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు.ఈ నిబంధనను తప్పని సరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.టీటీడీ( TTD ) కల్యాణ మండపాలలో వేడుకలు, వివాహాలు జరిపించే వారు డీజే సినిమా పాటలను( DJ Songs ) పెట్టడం పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.ఇది టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తాజా సమావేశంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.