హిందూమతంలో గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.నవగ్రహాలకు అధినేత సూర్యుడు( Sun ) మీన రాశిలో లేదా ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సమయం ఖర్మలకు నాందిగా పరిగణించబడుతుంది.
కాబట్టి ఖర్మ సమయంలో శుభకార్యాలు చేయడం హిందూ గ్రంధాలలో నిషిద్ధంగా పేర్కొనబడింది.అయితే దేవశయని ఏకాదశి రాకతో చతుర్మాసం ( Chaturmasam ) ప్రారంభమవుతుంది.
ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని ఒక నమ్మకం.అయితే ఖర్మ సమయం ముగిసిన తర్వాత శుభకార్యాలు తిరిగి దేవశయని ఏకాదశి నుండి ప్రారంభమవుతాయి.

అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం సూర్య భగవానుడు( Surya Bhagavan ) డిసెంబర్ 16వ తేదీన, గురువారం మధ్యాహ్నం 3:47 నిమిషాల నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.కాబట్టి ఖర్మలు ప్రారంభమవుతాయి.ఈ ఖర్మ సమయం ఒక నెలపాటు కొనసాగుతుంది.ఆ తర్వాత జనవరి 15వ తేదీన ముగుస్తుంది.ఖర్మ సమయంలో వివాహం,( Marriage ) గ్రహ ప్రవేశం,( House Warming ) నిశ్చితార్థం, గృహ నిర్మాణం లాంటి మొదలైన శుభకార్యాలు నిషేధించబడ్డాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరానికి రెండుసార్లు ఖర్మ సమయాలు వస్తాయి.
సూర్యుడు బృహస్పతి రాశి మీనరాశి లేదా ధనస్సు రాశిలోకి ప్రవేశించగానే ధర్మాలు మొదలవుతాయి.

ఖర్మ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు.అలాగే జనవరి నెలలో వివాహానికి అనుకూలమైన సమయాలు ఉన్నాయి.అలాగే ఫిబ్రవరిలో కూడా శుభ ముహూర్తాలు ఉన్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో శుభ, అశుభ సమయాలు, గ్రహాలు, నక్షత్రాల స్థానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అందువలన ఏదైనా శుభకార్యాన్ని లేదా కొత్త పనిని ప్రారంభించే ముందు ఉత్తమ సమయాన్ని చూస్తారు.
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధన సంక్రాంతి అని అంటారు.దీంతో ధనస్సు రాశిలో సూర్యుని ప్రవేశం విశేష ఫలితాలను అందిస్తుంది.