మీ శరీరంలోని వివిధ భాగాల ద్వారా మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు మనం మీ అరచేతుల( Palms ) ఆకారం లేదా సైజు సహాయంతో మీ వ్యక్తిత్వాన్ని( nature of people ) ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ వేళ్ళు ఎలా ఉన్నాయి? ఈ విషయాల నుంచి మీ స్వభావం, లక్షణాల గురించి చాలా నేర్చుకోవచ్చు.మీ వేళ్లు చిన్నగా మీ అర చేయి చతురస్రంగా ఉంటే మీరు నిజాయితీ గల వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు.
ఇది మాత్రమే కాకుండా మీరు కష్టపడి పని చేసేవారు.అలాగే జీవితం పట్ల మీ దృక్పథం చాలా ఆచరణాత్మకమైనది.
అటువంటి పరిస్థితిలో మీరు మీ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తే కొన్ని సార్లు అది హానికరం కావచ్చు.మీరు డబ్బు, వస్తు లాభాల గురించి ఆలోచిస్తారు.
మీకు అనేక రకాల నైపుణ్యాలు ఉంటాయి.మీ కుటుంబాన్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తారు.
వారిని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు.మీ వేళ్లు పొడవుగా, అరచేయి చతురస్రాకారంగా ( Palm square )ఉంటే మీరు మానసికంగా స్థిరంగా ఉంటారు.
మీరు మీ భావోద్వేగాలను విశ్వసించరు.మీరు నిరాశకు గురవుతారని భయపడుతూ ఉంటారు.
అంతేకాకుండా మీరు ఇతరులను కూడా సులభంగా నమ్మరు.

ప్రతి రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు.అలాగే కొత్త విషయాలు కనుగొనడంలో ముందుంటారు.మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులను ఆశ్చర్యపరిచేందుకు ఇష్టపడుతూ ఉంటారు.
మీ వేళ్లు చిన్నగా, మీ అరచేయి పొడవుగా( Palm length ) ఉంటే మీరు చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా, ఆకర్షణంగా ఉంటారు.మీలో ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉంటాయి.
మీరు రిస్కు తీసుకోవడానికి ముందుంటారు.మీరు ప్రతి చోట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండడానికి ఇష్టపడతారు.
కొన్నిసార్లు మీరు చాలా మొరటుగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తారు.మీరు ఎప్పుడూ కొత్త ఆలోచనల కోసం వెతుకుతూ ఉంటారు.

అలాగే మీ అరచేయి కూడా మీ వేళ్ల తో పాటు పొడవుగా ఉంటే మీరు ఎన్నో రకాల ఆలోచనలను కలిగి ఉంటారు.మీ మనస్తత్వం సున్నితంగా ఉంటుంది.మిమ్మల్ని చూస్తే మీరు ప్రశాంతంగా ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు.కానీ మీలో ఒక భావోద్వేగం ఎప్పుడూ ఉంటుంది.అలాగే మీరు ఇతరుల నుంచి చాలా సులభంగా కొన్ని విషయాలను నేర్చుకుంటారు.మీరు ఎప్పుడూ లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటారు.