ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.తిరుమల దేవస్థానానికి ప్రతిరోజు భక్తులు తరలివచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని రోజుల క్రితం శ్రీవారి దేవాలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దేవస్థాన అధికారులు షాక్కు గురయ్యారు.

తాజాగా తిరుమలలో అపచారం చోటు చేసుకుందంటూ భద్రత వైఫల్యం పై సార్వత్ర విమర్శలు వచ్చాయి.ఈ ఘటన ఇంకా మరిచిపోక ముందే మరోసారి తిరుమలలో అపచారం జరిగింది.దేవాలయం మాడవీధుల్లోకి కారు దూసుకు వచ్చింది.
ఇన్నోవా కారుపై సీఎం ఓ స్టిక్కర్ ఉండడం తో భద్రతా సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించారు.ఆ డ్రైవర్ దేవాలయ సిబ్బంది అడ్డు చెప్పకపోవడంతో కారు మడవీధుల్లో తీసుకొచ్చాడు.
ఇంకా చెప్పాలంటే ఆ డ్రైవర్ పార్కింగ్ లో స్థలం లేకపోవడంతో కారు మాడవీధుల్లోకి తీసుకొచ్చానని చెప్పాడు.

భద్రత సిబ్బంది ఎక్కడ లేరంటూ లేరు అని డ్రైవర్ వెల్లడించాడు.నిబంధన ప్రకారం మడవీధుల్లోకి వాహనం రావడం నిషేదం అని చాలామందికి తెలుసు.టీటీడీ చైర్మన్ వాహనాలను కూడా మడవీధులకు దూరంగా నిలిపివేస్తారు.
వీవీఐపీలు వచ్చినప్పుడు బ్యాటరీ బగ్గిల్లో మాడవీధుల్లో తిరుగుతాయి.భక్తులు కూడా చెప్పులు లేకుండా వెళ్లాలి.
అలాంటి ప్రాంతాల్లోకి వాహనం రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దేవాలయ భద్రత సిబ్బంది సీఎం కార్యాలయానికి చెందిన కారు అనుకుని వదిలేసాము అని చెబుతున్నారు.
ఈ కారు గురించి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.