దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే వారి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు.
ఎందుకంటే ఏ వస్తువైనా వాస్తు ప్రకారం లేకుండా ఉంటే వారి ఇంటికి ఏదైనా చెడు జరిగే అవకాశం ఉందని నమ్ముతుంటారు.వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల వారి సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చని కూడా నమ్ముతారు.
ఈ వాస్తు గురించి వాస్తు పండితులు మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలను చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు కనిపిస్తే అరిష్టంగా భావిస్తారు.
ఆ జంతువులలో నల్ల పిల్లి కూడా ఒకటి.అంతేకాకుండా మనం ఏదైనా ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళేటప్పుడు బల్లి అరిస్తే, కనిపిస్తే కూడా చెడు జరుగుతుందని చాలామంది పెద్దవారు నమ్ముతారు.
అయితే బల్లిని చూస్తే నిజంగా సమస్యలు వస్తాయా? ఇలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిలో బల్లి ఉంటే అది మహాలక్ష్మితో సమానం అని వేద పండితులు చెబుతున్నారు.ఇలా ఉంటే దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది పెద్దవారు నమ్ముతూ ఉంటారు.బల్లి మన ఒంటి మీద పడితే కూడా మంచికే సంకేతం అని చెబుతుంటారు.
కుడి పాదం మీద బల్లి పడితే అది కూడా ఎంతో మంచిది.ఒకవేళ ఎడమ కాలిపై బల్లి పడితే ప్రయాణాలు చేయబోతున్నారని అర్థం.
అంతేకాకుండా బల్లి పడే శరీర భాగాన్ని బట్టి కొన్ని రకరకాల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.ఒకవేళ రెండు బల్లులు కొట్టుకున్నట్లు కనిపిస్తే ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే ఇంట్లో బల్లులు కొట్టుకోవడం చూస్తే అది మానసిక సమస్యలను కూడా సూచించే అవకాశం ఉంది.