బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.ఆ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సీజన్ లో అత్యధికంగా చూడబోతున్న ఎపిసోడ్ అన్నట్లుగా ప్రభాస్ ఎపిసోడ్ ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.ఈ వారం కచ్చితంగా ప్రభాస్ ఎపిసోడ్ ఉంటుందని అంత భావించారు.
కానీ ఇప్పటి వరకు కనీసం ప్రోమో కూడా విడుదల అవ్వక పోవడం తో ఈ వారంలో స్ట్రీమింగ్ అవ్వడం అనుమానమే అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ప్రతి శుక్రవారం ఈ సీజన్ కి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంది.
కానీ ఇప్పటి వరకు ప్రోమో విడుదల కాకపోవడంతో కచ్చితంగా వారం ఆలస్యం గా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.
పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న ఈ ఎపిసోడ్ ని సాదా సీదాగా స్ట్రీమింగ్ చేయకుండా కాస్త ఎక్కువ ప్రచారం చేసి స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది.అందుకే ప్రోమో విడుదల చేసిన తర్వాత కనీసం వారం రోజుల సమయం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.అంటే దీన్ని బట్టి చూస్తే వచ్చే వారంలోని ఈ ఎపిసోడ్ ఉంటుంది.
కానీ ఈ వారంలో ఎపిసోడ్ ఉండదని క్లారిటీ వచ్చేసింది అంటూ అభిమానులు అసంతృప్తి అర్థం చేస్తున్నారు.ఆహా టీం ఇప్పటికే చాలా ఆలస్యం చేసిందని.ఇంకా ఆలస్యం చేస్తుంది అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.ఒక వైపు సినిమాల గురించి అప్డేట్ ఇవ్వని ప్రభాస్ మరో వైపు ఇలా టాక్ షోలో కనిపించడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.
ఆయన తన సినిమాల యొక్క అప్డేట్ ని కనీసం ఇక్కడ అయినా ఇస్తాడేమో అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు.కానీ ఈ ఎపిసోడ్ కాస్త ఆలస్యం అవ్వడం వారికి మింగుడు పడడం లేదు.