రెడ్ టీషర్ట్ లో ఫోజిచ్చిన అరియానా.. ఏదో తేడాగా ఉందంటూ నెటిజన్స్ ట్రోల్స్?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షో లో మంచి క్రేజ్ ను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాను అందుకుంది.

 Netizens Trolls On Ariyana Red Color T Shirt Pics Viral Details, Ariana, Ariyan-TeluguStop.com

అంతేకాకుండా నాన్ స్టాప్ బిగ్బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అరియానా ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది.

తొలిసారిగా తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.గతంలో స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా.ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.

కేవలం ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

అలా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.

ఇందులోనే తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.

అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.అలా చివరి రోజుల్లో మంచి ఫ్రెండ్స్ గా మారారు.

ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.

ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు.ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది అరియానా.

ఇక ఓవైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది.ఈ బ్యూటీ కి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఇక కొత్త కారు కొన్నప్పటినుంచి తెగ షికారులు కొడుతూ వాటికి సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.ఈ మధ్య బాగా అందాలను కూడా పరిచయం చేస్తుంది అరియానా.గత కొన్ని రోజుల నుండి మరో బుల్లితెర ఆర్టిస్ట్ అషు రెడ్డితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుంది.అప్పటినుంచి ఈమె కూడా అషు లాగా తయారవుతూ అందరి నోట్లో నానుతుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకుంది.అందులో రెడ్ కలర్ టీ షర్టు ధరించగా ఎటువంటి షో చేయకుండా నార్మల్గా కనిపించింది.అందులో తన ఫేస్ కూడా కాస్త డిఫరెంట్ గా అనిపించింది.దీంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్ మాత్రం.ఏదో తేడాగా ఉందే అంటూ ట్రోల్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube