మీకు ఉండే ఈ అలవాట్లే కిడ్నీలకు ముప్పు పెంచుతాయి.. జాగ్రత్త!

ఇటీవల రోజుల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.కిడ్నీ వ్యాధుల కారణంగా శారీరకంగానే కాదు ఆర్థికంగా కూడా నలిగిపోతుంటారు.

 It Is These Habits That Increase The Risk To Kidneys! Kidneys, Kidney Problems,-TeluguStop.com

అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ప్ర‌త్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.అలాగే మనకు ఉండే కొన్ని కొన్ని అలవాట్లే కిడ్నీలకు ముప్పు పెంచుతాయి.

మరి ఇంతకీ ఆ అలవాట్లు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు.

అంటే ప్రతిరోజు ప్రతి పూట నాన్ వెజ్( Non-Veg ) ఉండాల్సిందే.కానీ ఈ అలవాటు మీ కిడ్నీలను పాడయ్యేలా చేస్తుంది.

నాన్ వెజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.ప్రోటీన్ మనకు మంచిదే.

కానీ అధిక మొత్తంలో తీసుకుంటే అదే విషంగా మారుతుంది.ముఖ్యంగా కిడ్నీలపై( Kidney problem ) తీవ్ర ప్రభావం పడుతుంది.

కిడ్నీ స్టోన్స్, కిడ్నీ పనితీరు నెమ్మదించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.అందుకే నాన్ వెజ్ ను వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి.

Telugu Bad Habits, Tips, Healthy Kidneys, Kidney Problems, Kidneys, Latest-Telug

కొందరు ఉప్పు( Salt )ను చాలా అధికంగా తీసుకుంటారు.మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది.ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.ధూమపానం, మద్యపానం.ఇవి రెండు అలవాట్లు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి.

Telugu Bad Habits, Tips, Healthy Kidneys, Kidney Problems, Kidneys, Latest-Telug

కొందరు మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.అయితే గంటల తరబడి మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయం నిండిపోతుంది.దీని కారణంగా మూత్రశయం తో పాటు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

కొందరు చిన్న నొప్పి వచ్చిన వెంటనే పెయిన్ కిల్లర్ ను వేసేసుకుంటారు.

ఈ అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.అలా తరచూ పెయిన్ కిల్లర్ ను వేసుకుంటే కిడ్నీల ఆరోగ్యం తీవ్రంగా పాడవుతుంద‌ని చెబుతున్నారు నిపుణులు.

కాబట్టి ఇకనైనా జాగ్రత్త వహించండి.ఈ అలవాట్లను మానుకోండి.

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube