డీప్ సీక్ తో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పేసుకున్న చైనా!

ప్రపంచ దేశాలు టెక్నాలజీ అభివృద్ధిలో కొత్త ఉన్నత శిఖరాలు చేరితే, చైనా మరింత ముందుకెళ్లి, వాటిని మించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం చూస్తూనే ఉన్నాం.మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీ నుంచి అంతరిక్ష ప్రయోగాల వరకు ప్రతిభ కనబరుస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన చైనా, తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)(Artificial Intelligence (AI)) రంగంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

 China Has Turned The World On Its Side With Deep Seek Ai, Artificial Intelligenc-TeluguStop.com

చాట్‌జీపీటీని తలదన్నేలా చైనా ఓ సరికొత్త ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసింది.దీనికి పేరు ‘డీప్ సీక్ ఆర్1(Deep Seek R1)’.

ఈ టూల్‌ను చైనా స్టార్టప్ కంపెనీ ఒకటి అభివృద్ధి చేసింది.కేవలం ఏడాది సమయంలోనే వారు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు.

డీప్ సీక్ టూల్(Deep Search Tools) అభివృద్ధి వ్యయం చాలా తక్కువగా ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ మోడల్స్‌లో ఇది అత్యంత చవకైనదిగా నిలిచింది.డీప్ సీక్ ఆర్1 బేస్ మోడల్ కోసం కేవలం 5.6 మిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది.అదే సమయంలో, మెటా కంపెనీ ఏఐ (Meta Company AI)అభివృద్ధికి 65 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రకటించింది. డీప్ సీక్ వీ3(Deep Seek V3) మోడల్ అభివృద్ధికి ఈ స్టార్టప్ 6 మిలియన్ డాలర్ల వ్యయం మాత్రమే చేసింది.

దింతో ఎన్‌విడియా మార్కెట్‌పై ప్రభావం పడింది.డీప్ సీక్ టూల్ విడుదలతో అమెరికా మార్కెట్‌లో చిప్ మేకర్ ఎన్‌విడియాకు గట్టి షాక్ తగిలింది.డీప్ సీక్ ప్రభావంతో ఎన్‌విడియా షేర్లు ఒక్క రోజులో 17 శాతం క్షీణించాయి.దాంతో, దాదాపు 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కోల్పోయింది.

Telugu Ai, Ai Tools, Chatgpt, China, Deep Ai, Language, Machine, Nvidia Impact-L

లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా అనలైజేషన్, మెషీన్ లెర్నింగ్ అప్లికేషన్ల కోసం ఇది ఉపయోగకరమని తెలిపింది.ప్రత్యేకంగా డీప్ సీక్ ఆర్1, డీప్ సీక్ వీ3 వంద శాతం నైలామేంట్స్‌తో పనిచేసే టూల్స్‌గా అభివర్ణించారు.అమెరికాలో యాపిల్ ఫోన్ వినియోగదారులు ఈ టూల్‌కు సంబంధించిన యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడమూ చర్చనీయాంశమైంది.దీనివల్ల ఎన్‌విడియా మార్కెట్‌ను మరింతగా దెబ్బతీసింది.డీప్ సీక్ వంటి టూల్స్ ద్వారా చైనా ఏఐ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంటోంది.తక్కువ వ్యయంతో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం చైనాకు ప్రత్యేకతగా మారింది.

ఈ టూల్ ప్రపంచ దేశాలకు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube