ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.10
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.11.36 ల12.34
మేషం:

ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.
వృషభం:

ఈరోజు ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు.వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు.నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.
మిథునం:

ఈరోజు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.బంధువుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి.ఉద్యోగ విషయమై చెయ్యను పనికి నిందలు పడతారు.నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.
కర్కాటకం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
సింహం:

ఈరోజు దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు.వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి.
కన్య:

ఈరోజు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
తుల:

ఈరోజు వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి.ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి.ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.మొండి బకాయిలు వసూలవుతాయి.బంధు మిత్రుల ఆదరణ పొందుతారు.ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
వృశ్చికం:

ఈరోజు ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి.వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.వాహన సంభందిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి.స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
ధనుస్సు:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి.
మకరం:

ఈరోజు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.
గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగమున పురోగతి కలుగుతుంది.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కుంభం:

ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి.వ్యాపార మందకొడిగా సాగుతాయి.
మీనం:

ఈరోజు సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు.
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.