కొన్ని పాటలు చక్కటి మ్యాజిక్ చేస్తాయి.అందులో భావం లేకపోయినా పటాసుల్లా పేలుతాయి.జనాల మనుసుల్లోకి దూసుకుపోతాయి.అందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ బుల్లెట్ బండి సాంగ్.అప్పటికే ఆ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేసినా.ఓ నూతన వధువు ఈ పాటకు డ్యాన్స్ చేయడం.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.ఆ పాట మరింత జోరుగా జనాల్లోకి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది.
ఇలాంటి పాటలే మరికొన్ని ఉన్నాయి.
గతంలో వైదిస్ కొలవెరి అనే పాట కూడా అప్పట్లో సంచలన విజయం సాధించింది.యూట్యూబ్ లో ఓ రేంజిలో వ్యూస్ సాధించింది ఈ పాట.నిజానికి ఈ పాటలో సైతం ఏ అర్థం లేదు.ఓ తాగుబోతు తాగుడు ఎక్కువై పాడుకున్న పాట.కానీ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది.అలాంటి పాటే రౌడీ బేబీ సాంగ్.
ధనుష్, సాయి పల్లవిపై చిత్రీకరించిన ఈ పాట ఓ రేంజిలో సంచలనం కలిగించింది.ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న సాంగ్ మాణికె మాగే హితే.
శ్రీలంకలోని నెటిజన్లు ఈ పాట ఓ ఊపు ఊపుతుంది.ఈ పాట పాడిన గాయని యొహానీ వాయిస్ అక్కడి జనాలను మెస్మరైజ్ చేస్తుంది.
శ్రీలంక వాసులు మాణికె మాగే హితే పాటలో మునిగి తేలుతున్నారు.అంతేకాదు.
ఈ యూట్యూబ్ సంచలనం పలు భారతీయ భాషల్లోకి అనువదింపబడటం మరో విశేషం.
హిందీ, తమిళ్, పంజాబీ, మలయాళం, నేపాలీ భాషల్లోకి ఇప్పటికే అనువదింపబడింది.అంతేకాదు.ప్రస్తుతం ఈ పాట అమెజాన్ మ్యూజిక్ లో టాప్ లో నిలిచింది.
అటు ఈ పాట సంచలనం రేపుతున్న నేపథ్యంలో మన సంగీత దర్శకులపై నెటిజన్లు విమర్శలు గుప్పించడం విశేషం.ఎక్కడైనా హిట్ కొట్టిన పాటల్లోని ట్యూన్లు కాపీ కొట్టి తమ పాటలుగా చెప్పుకునే బ్యాచ్ అంతా ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.థమన్, అనంత శ్రీరామ్, సుద్దాల అశోక్ తేజ ఇంకా ఈ పాటను కాపీ కొట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.