మచ్చలేని మెరిసే ముఖ చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇలాంటి చర్మం కోసం ఆరాటపడుతుంటారు.
ఎలాంటి మచ్చలు లేకుండా ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటూ ఉంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.
రోజు నైట్ ఈ క్రీమ్ రాసుకుంటే మీ ముఖం పై ఒక్క మచ్చ కూడా ఉండదు.అదే సమయంలో చర్మం తెల్లగా, కాంతివంతంగా కూడా మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ) ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder) హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ), చిటికెడు కుంకుమ పువ్వు వేసి స్పూన్ సహాయంతో కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి.తద్వారా మన క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే పూర్తిగా తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
రోజు ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతాయి.
స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.చర్మం కాంతివంతంగా మారుతుంది.
మచ్చలేని తెల్లటి మెరిసే ముఖ చర్మం మీ సొంతం అవుతుంది.పైగా ఈ క్రీమ్ ను వాడటం వల్ల ముడతలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
సాగిన చర్మం కూడా టైట్ గా మారుతుంది.