దంతాల నొప్పి వచ్చిందంటే చాలు ఏదీ తినలేం, తాగలేం.అలాంటి సమయంలో కేవలం దంతాలను కదిలించినా చాలు, విపరీతమైన నొప్పి కలుగుతుంది.
అయితే దీనికి చింతించాల్సిన పనిలేదు.ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే దంతాల నొప్పి సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చు.
అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాసులో అర టీ స్పూన్ లవంగాల పొడి ని కొబ్బరి నూనెతో పేస్ట్ లాగ కలపాలి.అల కలిపిన మిశ్రమాన్ని నొప్పిగా ఉన్న పంటిపై మరియు చిగుళ్ళపై రుద్దాలి.ఇలా చేసిన వెంటనే ఈ మిశ్రమం యొక్క ప్రభావం పంటిపై పని చేస్తుంది.
లవంగాలలో ఉండే ఉగెనొల్ అనె రసాయనం మరియు కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ తత్వం కలిసి పంటి నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.ఇలా రోజుకు 3 సార్లు చెస్తే మరింత ఉపశమనం కలుగుతుంది.
తద్వార మీరు మీ పనులు పూర్తి చేసుకుని తర్వాత దంతవైద్యుడుని కలవచ్చు.
అంతేకాదు అల్లం కొమ్మును తీసుకుని బాగా కడిగి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
ఆ ముక్కలను నొప్పి ఉన్న దంతాలతో నమలాలి.అలా చేయడం వల్ల అల్లంలో ఉండే ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి.