డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒకటి.ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే అంజీర్ (anjeer )ఒక సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడుతుంది.
ఎందుకంటే, అంజీర్ లో అనేక పోషకాలు మరియు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి.అయితే అంజీర్ ను నేరుగా కాకుండా పాలుతో కలిపి తీసుకుంటే మరిన్ని ఎక్కువ లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు అంజీర్ లను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.ఆపై కొద్దిగా వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న అంజీర్ ను ఒక గ్లాస్ పాలల్లో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించండి.ఆపై రుచి కోసం తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయండి.
అంజీర్ పాలును(anjeer milk) ప్రతి రోజూ నైట్ తాగితే చాలా ఆరోగ్య లాభాలు పొందుతారు.అంజీర్‌లో అధికంగా ఉండే ఫైబర్, జీర్ణశక్తిని (Fiber, digestion)మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
అలాగే ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు.అలాంటి వారు రెగ్యులర్ గా అంజీర్ పాలును తీసుకుంటే మంచిగా నిద్ర పడుతుంది.
నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.
అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి(Vitamin C) ఉంటాయి.పాలు మరియు అంజీర్ కలిపి తీసుకోవడం శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.పాలు, అంజీర్.
రెండింటిలోనూ కాల్షియం మెండుగా ఉంటుంది.అంజీర్ పాలును డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.
కీళ్ల నొప్పులు(joint pain) తగ్గుముఖం పడతాయి.అంజీర్ పాలులోని పొటాషియం మరియు మెగ్నీషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
హృదయ ఆరోగ్యానికి అండంగా ఉంటాయి.
అంజీర్ పాలును మార్నింగ్ టైమ్ లో కూడా తీసుకోవచ్చు.ఉదయం తీసుకుంటే శక్తి స్థాయిలు పెరుగుతాయి.రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
ఇక వ్యాయామం చేసిన తర్వాత తిరిగి శక్తిని పొందడానికి కూడా అంజీర్ పాలు అద్భుతంగా తోడ్పడతాయి.