బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు షారుక్ ఖాన్ ఒకరు.ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక షారుక్ ఖాన్( Shahrukh Khan ) సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈయనకు తెలుగులో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్.
ఇలా షారుక్ ఖాన్ చివరిగా జవాన్( Jawan ) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది స్టార్ హీరోలు మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే.
![Telugu Allu Arjun, Bollywood, Dance Permance, Kamal Haasan, Mahesh Babu, Prabhas Telugu Allu Arjun, Bollywood, Dance Permance, Kamal Haasan, Mahesh Babu, Prabhas](https://telugustop.com/wp-content/uploads/2025/01/shahrukh-khan-sweet-request-to-allu-arjun-ram-charan-detailsa.jpg)
తాజాగా షారుక్ ఖాన్ దక్షిణాది స్టార్ హీరోలైనటువంటి రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ దళపతి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల గురించి మాట్లాడారు.దుబాయిలో( Dubai ) జరిగిన ఓ వేడుకలో భాగంగా షారుక్ ఖాన్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా షారుక్ ఖాన్ దక్షిణాది స్టార్ హీరోలను( South Actors ) ఉద్దేశించి మాట్లాడారు.సౌత్ సినీ ఇండస్ట్రీలో నాకు రజనీ కమల్ సర్ వంటి వారు చాలా మంచి స్నేహితులంటూ ఎంతో గౌరవంగా మాట్లాడారు.
![Telugu Allu Arjun, Bollywood, Dance Permance, Kamal Haasan, Mahesh Babu, Prabhas Telugu Allu Arjun, Bollywood, Dance Permance, Kamal Haasan, Mahesh Babu, Prabhas](https://telugustop.com/wp-content/uploads/2025/01/shahrukh-khan-sweet-request-to-allu-arjun-ram-charan-detailsd.jpg)
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్( Prabhas ) మహేష్( Mahesh ) చరణ్( Charan ) బన్నీ వంటి వారితో మంచి స్నేహం ఉందని తెలిపారు.నేను ఈ వేదికగా మిమ్మల్ని అందరిని ఒకటే వేడుకుంటున్నాను దయచేసి మీరెవరు కూడా డాన్సులు( Dance ) వేగంగా చేయడం మానుకోవాలి ఎందుకంటే మీ అంత వేగం నేను చేయలేకపోతున్నాను.మీతో పాటు కలిసి డాన్స్ చేయడం నాకు కష్టంగా మారింది అంటూ ఈ సందర్భంగా దక్షిణాది సినీ సెలబ్రిటీలను ఉద్దేశించి షారుఖ్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.