ఉదయం నిద్ర లేవగానే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.అయితే టీ కాఫీల వల్ల( Tea Coffee ) ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది అన్న విషయం పక్కన పెట్టేస్తే.
ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ వాటర్( Herbal Water ) మాత్రం హెల్త్ పరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.టీ కాఫీలకు బదులు రోజు ఈ హెర్బల్ వాటర్ తాగితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.
మరి ఇంతకీ ఆ హెర్బల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర,( Cumin Seeds ) హాఫ్ టీ స్పూన్ వాము,( Ajwain ) హాఫ్ టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, అంగుళం దాల్చిన చెక్క, చిటికెడు కుంకుమపువ్వు, దంచిన యాలకులు మరియు హాఫ్ టీ స్పూన్ అల్లం తరుము వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మరియు వన్ టీ స్పూన్ స్వచ్ఛమైన తేనె( Honey ) మిక్స్ చేస్తే మన హెర్బల్ వాటర్ అనేది రెడీ అవుతుంది.

ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ప్రతిరోజు ఉదయం ఈ హెర్బల్ వాటర్ ను కనుక తాగితే ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి.మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది.అలాగే ఈ హెర్బల్ వాటర్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.మన శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ప్రస్తుత చలికాలంలో ప్రతిరోజు ఈ హెర్బల్ వాటర్ ను తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తొలగిపోతాయి.ఈ హెర్బల్ వాటర్ రక్త నాళాల నుండి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఋతు తిమ్మిరి, కండరాల నొప్పులు మరియు తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందించడంలోనూ ఈ హెర్బల్ వాటర్ ఒక న్యాచురల్ మెడిసిన్ మాదిరి పనిచేస్తుంది.







