కావ్యేతి హాస పురాణాలలో అతిశయోక్తులు ఉండటం సత్యం.వాటినన్నిం టిని యథాతథంగా స్వీకరించటమే కర్తవ్యం.
దానిలోని సత్యా సత్యాలను నిర్ణయించటం సాధ్యం కాని పని.మన పురాణాలు, యుగాల్ని అనుసరించి ఆయుః ప్రమా ణం, శరీర ప్రమాణం నిర్ణయించింది.వాటి ప్రకారం మనం అర్థం చేసుకోవాలి.కావ్యేతిహాస పురాణాలలో యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్యకు, తుదకు మరణించిన వారి సంఖ్యకు, ఏకత్వం కుదరదు.ఇక రామాయణం విషయం వివరిస్తాను.సీతా పరిత్యాగ అనంతరం రాముడు పరిపాలిస్తున్నాడు.
తన కొలువు కూటానికి వెలుపల లక్ష్మణుని కాపలా ఉంచాడు.ఒకనాడు రాముడు కొలువులో ఉన్నాడు.
యమ ధర్మరాజు మహర్షి వేషంలో వచ్చి “నీతో ఏకాంతంగా మాట్లా డాలి.అందరినీ బయటకు పంపవలసింది.
నేను నీతోమాట్లాడే సమయంలో ఎవరు లోపలికి వచ్చినా, అతని శిరశ్ఛేదం చేయవలసిందని రాముని ఒప్పించాడు.
అపుడ అతడు రామునితో రామా! నేను యముడను.
నీవు శ్రీ మహా విష్ణు మూర్తివి. నీవు భూలోకంలో అవతరించి పదకొండు వేల సంవత్సరాలు అయింది.
రావణాది దుష్ట సంహారం పూర్తి అయింది.కనుక అవతార పరిసమాప్తి చేయాల్సింది.
అని చెబుతుండగా లక్ష్మణుడు లోపలకు వచ్చాడు.యముడ అదృశ్యం అయ్యాడు.
అన్నమాట ప్రకారం తమ్ముని శిరశ్ఛేదం చేయలేక రాజ్య బహిష్కృతుని చేశాడు.లక్ష్మణుడు సరయూ నదిలో మునిగి అవతారం చాలించాడు.
వెంటనే రాముడు కూడ సరయూ నదిలో దిగి అవతారం చాలించాడు.కనుక దీని ప్రకారం చూస్తే రాముడు పది వేల సంవత్సరాలకు పైగా రాజ్య పరిపాలన చేశాడు.