మనదేశంలో రకరకాల మనుషులు, మతాలు, కులాలు, భాషల వారు ఉంటారు.అలాగే వారి కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు ( Commitments, customs, traditions )చాలా భిన్నంగా ఉంటాయి.
అందులో రాజస్థాన్ కు చెందిన జిప్సీ తెగ ( Gypsy tribe )కూడా ఒకటి.వీరి ఆచారాలు తెలిసాక తప్పక ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే వీటి గురించి ఇంతవరకు విని ఉండరు.ఇక ఈ తెగకు చెందిన ప్రజలు చాలా పేదవారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ మహిళలు చేకూడని పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు.దీనివలన జిప్సీ తెగ అపాఖ్యాతి పాలవుతోంది.
ఈ కాలంలో కూడా ఈ తెగ రోడ్ల వెంట నివసిస్తోంది.ఇక్కడి మనుషులు చనిపోయిన జంతువుల కళేబరాలను తింటారు.

వీరికి ఓ విచిత్రమైన సంప్రదాయం కూడా ఉంది.దీన్ని ఇప్పటికీ కూడా వారు పాటిస్తూ ఉన్నారు.ఆ విచిత్రమైన సాంప్రదాయం( strange tradition ) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే సాధారణంగా మన ఇంట్లో బిడ్డ పుడితే ఎంతో ఆనందంగా పండగ చేసుకుంటాము.
అలాగే పిల్లలు పుట్టారని లడ్డులూ కూడా అందరికీ పంచి పెడతాము.దీంతో మన మొత్తం కుటుంబానికి ఎంతో ఆనందం వస్తుంది.
కానీ ఈ జిప్సీ ప్రజలు మాత్రం బిడ్డ పుట్టినప్పుడు చాలా బాధపడతారు.అంతేకాకుండా ఏడుస్తారు కూడా.
అంతేకాకుండా బిడ్డ పుట్టిన ఆ ఇంట్లో ఆరోజు వంట కూడా అస్సలు చేయరు.

అయితే మన దేశంలో ఎవరైనా చనిపోతే ఆరోజు వంట చేయకుండా ఉంటారు. కానీ జిప్సీ తెగలు ఎవరైనా చనిపోతే సంబరాలు చేసుకుంటారు.అలాగే శవాన్ని దానం చేసే వరకు మాంసం తింటూ, మద్యం తాగుతూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని స్వీట్లు కూడా కొనుక్కుంటారు.అయితే ఇక్కడ ప్రజలు తినడానికి తిండి లేకపోయినా ఉండగలరు, కానీ మద్యం తాగకుండా అస్సలు ఉండలేరు.
ఆస్తులు అమ్మి అయిన సరే మద్యం కొనుక్కుంటారు.అలాగే తమ పిల్లలను బడికి కూడా పంపకుండా నిరక్షరాశులుగా ఉంచుతున్నారు.