అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమా ఏదో తెలుసా.. ఆ డైరెక్టర్ అంటే భయమా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) టాలెంట్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బన్నీ నటుడిగా ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.

 Interesting Facts About Allu Arjun Details, Allu Arjun, Allu Arjun Assistant Dir-TeluguStop.com

అయితే అల్లు అర్జున్ ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట.శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పెళ్లాం ఊరెళితే సినిమా( Pellam Oorelithe Movie ) అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.తమిళంలో హిట్ గా నిలిచిన చార్లీ చాప్లిన్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా నిర్మాతలలో అల్లు అరవింద్( Allu Arvind ) కూడా ఒకరు కాగా ఆయన సూచనల మేరకు ఈ సినిమాకు బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది.అదే సమయంలో బన్నీకి ఎస్వీ కృష్ణారెడ్డి అంటే ఎంతో భయమట.

ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి ఒక సందర్భంలో పంచుకున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు.ఈ సినిమా హిందీ హక్కులు, ఓటీటీ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని ఈ సినిమా బిజినెస్ విషయంలో మేకర్స్ పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు సైతం గట్టి పోటీ నెలకొందని సమాచారం అందుతోంది.

కొన్ని ఏరియాలలో మైత్రీ నిర్మాతలు సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసే చహన్స్ అయితే ఉందని తెలుస్తోంది.ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో టార్గెట్ ను రీచ్ కావడానికి మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు.పుష్ప ది రూల్ సినిమా కలెక్షన్ల ఆధారంగా బన్నీ మార్కెట్ గురించి సైతం పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube