అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమా ఏదో తెలుసా.. ఆ డైరెక్టర్ అంటే భయమా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) టాలెంట్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

బన్నీ నటుడిగా ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.అయితే అల్లు అర్జున్ ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట.

శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పెళ్లాం ఊరెళితే సినిమా( Pellam Oorelithe Movie ) అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

తమిళంలో హిట్ గా నిలిచిన చార్లీ చాప్లిన్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా నిర్మాతలలో అల్లు అరవింద్( Allu Arvind ) కూడా ఒకరు కాగా ఆయన సూచనల మేరకు ఈ సినిమాకు బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది.

అదే సమయంలో బన్నీకి ఎస్వీ కృష్ణారెడ్డి అంటే ఎంతో భయమట.ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి ఒక సందర్భంలో పంచుకున్నారు.

"""/" / అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా హిందీ హక్కులు, ఓటీటీ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని ఈ సినిమా బిజినెస్ విషయంలో మేకర్స్ పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు సైతం గట్టి పోటీ నెలకొందని సమాచారం అందుతోంది.

"""/" / కొన్ని ఏరియాలలో మైత్రీ నిర్మాతలు సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసే చహన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో టార్గెట్ ను రీచ్ కావడానికి మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు.

పుష్ప ది రూల్ సినిమా కలెక్షన్ల ఆధారంగా బన్నీ మార్కెట్ గురించి సైతం పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. హైపర్ ఆది వార్నింగ్ మామూలుగా లేదుగా!