టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో విజయ్ సేతుపతికి( Vijay Sethupathi ) ప్రత్యేక గుర్తింపు ఉంది.విజయ్ సేతుపతి నటించిన సినిమాలకు బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరుగుతోంది.
అయితే విజయ్ సేతుపతికి ఈ సక్సెస్ సులువుగా దక్కలేదు.ఎన్నో కష్టాలను అనుభవించి ఒక్కో మెట్టు పైకి ఎదిగి విజయ్ సేతుపతి ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది.
అయితే విజయ్ సేతుపతి తాజాగా చేసిన ఒక పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు( Tamil Nadu Elections ) జరుగుతుండగా చాలామంది సినీ ప్రముఖులు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అలా ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్లలో విజయ్ సేతుపతి ఒకరు కాగా విజయ్ సేతుపతి వృద్ధురాలి( Old Woman ) కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
![Telugu Tamil Nadu, Vijaysethupathi-Movie Telugu Tamil Nadu, Vijaysethupathi-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/actor-vijay-sethupathi-takes-selfie-with-old-woman-detailsd.jpg)
ఈ వీడియో చూసిన నెటిజన్లు విజయ్ సేతుపతి రీల్ హీరో మాత్రమే కాదని రియల్ హీరో( Real Hero ) కూడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.దటీజ్ మక్కల్ సెల్వన్ అంటూ మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.చాలామంది హీరోలు నీతులు చెబుతారు కానీ రియల్ లైఫ్ లో ఆ నీతులను పాటించడానికి పెద్దగా ఇష్టపడరు.కానీ విజయ్ సేతుపతి మాత్రం ఆ హీరోలకు భిన్నమని ఎలాంటి సందేహం అవసరం లేకుండా చెప్పవచ్చు.
![Telugu Tamil Nadu, Vijaysethupathi-Movie Telugu Tamil Nadu, Vijaysethupathi-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/actor-vijay-sethupathi-takes-selfie-with-old-woman-detailss.jpg)
విజయ్ సేతుపతి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమని ఒక సెల్ఫీ ఇవ్వాలని ఆమె కోరారు.మరోవైపు వీల్ ఛైర్ పై వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధురాలిని సైతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎంచుకుంటే మాత్రమే మన దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమా సినిమాకు నటుడి విజయ్ సేతుపతి రేంజ్ పెరుగుతోంది.