ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి.ఓ క్రమంలో ఎస్ పేట మండలం చౌట భీమవరం గ్రామంలో ఈ రోజు జరిగిన దాడి ఇందుకు నిదర్శనం.
ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలం చౌటభోమవరం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ప్రచార రధం ఎక్కుతున్న ఆ పార్టీకి చెందిన సర్పంచ్ లక్ష్మీనరసయ్య పై మరో వర్గం దాడి చేశారు.
ప్రచార రధం ఎక్కుతున్న లక్మీ నరసయ్యను మరో వర్గానికి చెందిన మాదాల హజరత్తయ్య నాయుడు వర్గం తోసేసి దాడికి దిగారు.స్థానికులు కలగచేసుకొని సర్దుమణుగు చేశారు.కొద్దిసేపటి అనంతరం ప్రచారం చేస్తూ వస్తున్న రధాన్ని ఆపి మరీ వెంకయ్య స్వామి గుడి దగ్గర సర్పంచ్ లక్ష్మీనరసయ్య వర్గం హజరత్తయ్య వర్గం పై దాడి చేశారు.కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.దీంతో విక్రమ్ రెడ్డి ప్రచారం నిలిపివేసి అక్కడ నుండి వెళ్లిపోయారు.







