తెలుగులో ప్రముఖ దర్శకుడు సన్యాసి రెడ్డి దర్శకత్వం వహించిన “సంపంగి” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ “కంచి కౌల్” గురించి ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంన్నప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
అయితే తెలుగులో కంచి కౌల్ హీరోయిన్ గా నటించిన “సంపంగి, చెప్పాలని ఉంది, ఫ్యామిలీ సర్కస్, శివ రామ రాజు, తదితర చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి.కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
అయితే అక్కడ కూడా సినిమా అవకాశాలు తలుపు తట్టక పోవడంతో కొంతమేర నిరాశ చెందింది. అయినప్పటికీ పట్టు విడవకుండా సినిమా అవకాశాల కోసం శ్రమించగా చివరికి పలు ధారావాహికలలో నటించే అవకాశాలను దక్కించుకుంది.
అయితే వెండితెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయినటువంటి కంచి కౌల్ బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులని బాగానే అలరించింది. దీంతో దాదాపుగా ఎనిమిది కి పైగా సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకుంది.
అయితే ఈ క్రమంలో కుంకుమ భాగ్య, సీరియల్ లో హీరోగా నటించిన “షబ్బీర్ అహ్లువాలియా” అనే సీరియల్ నటుడితో ప్రేమలో పడింది.దీంతో వీరిద్దరూ ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
దీంతో వీరిద్దరి ప్రేమకి చిహ్నంగా కంచి కౌల్ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా ప్రస్తుతం కంచి కౌల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరంలో నివాసం ఉన్నట్లు సమాచారం.