గోధుమగడ్డి రసం గురించి ఎప్పుడైనా విన్నారా ? ఈ జెనరేషన్ వారికి పెద్దగా పరిచయం లేని జ్యూస్ లెండి అది.ఇప్పటి పేరెంట్స్ కూడా దాని విలువ, అది చేసే మేలు గురించి ఎప్పుడో మరచిపోయుంటారు.
మర్చిపోతే గుర్తు చేసుకోండి.లేదంటే గోధుమగడ్డి రసం ఎందుకు తాగాలో మీ పిల్లలకు చెప్పేందుకు ఈ కథనాన్ని చూపించండి.
* గోధుమగడ్డి లో ఎమినో ఆసిడ్స్, విటమిన్ ఏ, బి-కాంప్లెక్స్, సి, డి , ఈ, మేగ్నేశియం, ఐరన్, పొటాషియం, జింక్.సేలేనియం, క్లోరోఫిల్ మరియు ఇతర మినరల్స్ ఉంటాయి.
* యాంటి క్యాన్సర్, యాంటి బ్యాక్టీరియల్t, యాంటి ఇంఫ్లేమేంటరి, యాంటిఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటడం దీని ప్రత్యేకత.
* గోధుమగడ్డి రసంతో ఇమ్యునిటి సిస్టం బాగా బలపడుతుంది.
రోగనిరోధకశక్తి అమాంతం పెరిగిపోతుంది.ఎందుకంటే దీంట్లో ఎంజిమ్స్, యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
* ఒంట్లో టాక్సిన్స్ తొలగించడానికి బాగా ఉపయోగపడే జ్యూస్ ఇది.కాబట్టి ఉదయాన్ని దీనితో మొదలుపెట్టడం మరచిపోవద్దు.
* న్యూట్రీoట్స్ పుష్కలంగా కలిగి ఉండటం వలన ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింక్స్ కన్నా ఇది ఏంతో ఉప్దయోగం.
* బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో పెట్టడంలో చాలా పెద్ద సహాయం చేస్తుంది గోధుమగడ్డి రసం.ఈ విషయాన్ని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి.
* గుండె ఆరోగ్యానికి, అనవసరపు కొవ్వు తగ్గించుకోవడానికి పనికొచ్చే ఓషధం లాంటిది గోధుమగడ్డి జ్యూస్.కాబట్టి దీన్ని రోజు తాగడం మరచిపోవద్దు.