తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ఆసక్తికరంగా సాగుతోంది.మొదటి వారం తర్వాత హేమ ఎలిమినేట్ అవ్వగా, రెండవ వారం ఆరంభంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రీ ఎంట్రీ ఇచ్చింది.
తమన్నా సింహాద్రీ ఎంట్రీపై శ్రీరెడ్డి తీవ్ర అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.కొన్నాళ్ల క్రితం శ్రీరెడ్డి ఇష్యూ మీడియాలో పతాక స్థాయిలో ఉన్న సమయంలో తమన్నా మీడియా ద్వారా జనాలకు తెలిసింది.
శ్రీరెడ్డి కారణంగానే తమన్నా సింహాద్రీకి మంచి స్కోప్ దక్కిందని చెప్పుకోవాలి.

ఇక శ్రీరెడ్డితో మాట్లాడిన మాటలను బయటకు తెచ్చిన తమన్నా సంచలనం రేపింది.శ్రీరెడ్డికి దూరం అయిన తర్వాత మళ్లీ మీడియాలో కనిపించకుండా పోయిన తమన్నా మళ్లీ ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా వచ్చింది.ఈ విషయమై శ్రీరెడ్డి స్పందిస్తూ బిగ్‌బాస్ గాడు పెద్ద ఎదవ.నాగార్జున గారికి బిగ్‌బాస్ డబ్బులు ఇస్తే మంచి వాడు లేదంటే పెద్ద ఎదవ అంటూ నాగార్జునను టార్గెట్ చేసి మరీ విమర్శలు చేసింది.

ఈ సీజన్‌కు శ్రీరెడ్డి ఒక కంటెస్టెంట్‌గా ఉంటుందని అంతా భావించారు.అంతటి వివాదాస్పదురాలు కంటెస్టెంట్‌గా ఉంటే బిగ్‌బాస్ టీఆర్పీరేటింగ్ ఎక్కడికో వెళ్తుంది.కాని సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను ఆమె టార్గెట్ చేసింది.
అందుకే ఆమె మూడవ సీజన్‌కే కాదు ఎప్పటికి బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశమే లేదు.ఎందుకంటే బిగ్‌బాస్‌కు ఆమె సెట్ అవ్వదు అనేది కొందరి మాట.ఇక బిగ్‌బాస్‌పై మొదటి నుండి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు తమన్నా ఎంట్రీతో మళ్లీ రెచ్చి పోతుంది.







