టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర( Devara ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా ద్వారా తారక క్రేజ్ మరింత పెరిగిపోయింది.
ఇకపోతే దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు.మొదటి భాగం కేవలం ఇంట్రడక్షన్ మాత్రమేనని అసలు కథ రెండవ భాగంలో ఉందని చిత్ర బృందం వెల్లడించారు.ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం వార్ 2 సినీమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా అనంతరం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ సినిమాలో ఈయన బిజీ కానున్నారు ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయిన అనంతరం తిరిగి కొరటాల డైరెక్షన్ లో దేవర 2( Devara 2 ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇకపోతే తాజాగా దేవర 2 సినిమాకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో కొరటాల శివ ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇక ఈ స్క్రిప్ట్ లో ఎన్నో ఊహించని ట్విస్టులు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.ఈ సినిమా స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తూ పుష్ప 2 సినిమా తరహాలో ఈ చిత్రాన్ని కూడా రూపొందించాలని కొరటాల భావించినట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిన లేదా వచ్చే ఏడాది మొదట్లోనే ప్రారంభం కాబోతుందని సమాచారం.