సినిమాలకు సంబంధించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.సినిమాల్లో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటే మాత్రమే సినిమాలు సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.
అయితే తెరపై రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి మెప్పించడం సులువైన విషయం కాదు.ఈ సీన్లను వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి హీరో హీరోయిన్లు ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే.
2014 సంవత్సరంలో విడుదలైన కాంచి సినిమాకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ మిస్తీ చక్రవర్తి ( Karthik Aryan , Misty Chakraborty )జంటగా నటించారు.
సుభాష్ గయ్ ( Subhash Guy )డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కగా ఈ సినిమాలోని లిప్ లాక్ సీన్ కోసం 37 టేకులు తీసుకున్నారట.
ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ముద్దు సీన్ కూడా తలనొప్పిగా మారుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదని ఆయన తెలిపారు.దర్శకుడు సంతృప్తి చెందకపోవడంతో ఆ సీన్ కు 37 టేక్స్ ( 37 takes )తీసుకోవాల్సి వచ్చిందని కార్తీక్ ఆర్యన్ పేర్కొన్నారు.37 టేక్స్ తీసుకున్న తర్వాత డైరెక్టర్ ఆ సీన్ కు ఓకే చెప్పారని కార్తీక్ ఆర్యన్ వెల్లడించారు.అన్ని టేక్స్ తీసుకోవడం నా తప్పు లేదని ఆయన పేర్కొన్నారు.

మిస్తీ చక్రవర్తి నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని అనుకున్నానని కార్తీక్ ఆర్యన్ వెల్లడించారు.డైరెక్టర్ చెప్పినట్లుగానే ముద్దు పెట్టుకున్నామని అయినా ఆయన కట్ చెప్పేశారని కార్తీక్ ఆర్యన్ వెల్లడించారు.ఒకానొక దశలో నాకు ముద్దు పెట్టుకోవడం రావట్లేదని ఎలా పెట్టుకోవాలో చూపించిండని డైరెక్టర్ ను అడిగానని ఆయన తెలిపారు.
అయితే మిస్తీ చక్రవర్తి ఈ కిస్ సీన్ గురించి ఎక్కడా స్పందించలేదు.కార్తీక్ ఆర్యన్ చెప్పిన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.