తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు డజన్ వరకూ హీరోలు ఉన్నారు.అయితే ఇందులో కొంత మంది సొంత టాలెంట్ తో ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారు అయితే.
మరి కొంత మంది అటు సినీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు.ఇలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత మాత్రం ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించు కున్నారు చాలా మంది హీరోలు.
అలాంటి వారిలో నారా ఫ్యామిలీకి చెందిన నారా రోహిత్ కూడా ఒకరు.భారీ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించు కున్నాడు.
ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పు కున్నాడు.యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.
కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం నారా రోహిత్ చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందక పోవడంతో చివరికి నారా రోహిత్ ఇక చిత్ర పరిశ్రమలో కను మరుగై పోయాడు అని చెప్పాలి.నారా రోహిత్ భారీ బ్యా గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.
కానీ అతని కుటుంబ సభ్యుల డీటెయిల్స్ ఏంటి అనేది మాత్రం చాలా మందికి తెలియదు.

మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి స్వయానా తమ్ముడు కొడుకు నారా రోహిత్.ఆయన రామ్మూర్తి నాయుడు.ఇక తిరుపతి లోని ఒక విల్లాలో రామ్మూర్తి కుటుంబం నివసిస్తోంది.
చంద్రబాబు నాయుడు చదువు పూర్తి కాగానే రాజకీయా ల్లోకి రావడం తో ఇంటి బాధ్యతలను ఇక ఆస్తులకు సంబంధించిన అన్నీ బాధ్యతలను నారా రామ్మూర్తి చూసు కున్నాడట.ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ నారా రోహిత్ మాత్రం ఎప్పుడూ ప్రొఫైళ్ మెయింటైన్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు.
కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను కూడా నిర్మించారు నారా రోహిత్.