ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు.కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో, ఊహించని వ్యక్తుల మధ్య చిగురిస్తుంది.
సరిగ్గా అలాంటి సంఘటనే ఇది.చైనాలో( China ) తప్పిపోయి, లాండ్రీ( Laundry ) ఎక్కడుందో తెలియక సాయం కోసం వెతుకుతున్న ఓ మలేషియా వ్యక్తి జీవితంలో ప్రేమ( Love ) పువ్వులా విరబూసింది.అతడు దారి అడుగుతూ వెళ్లిన ఓ అమ్మాయితోనే ప్రేమలో పడతాడు అని ఎవరూ ఊహించలేదు.
జైరీ అమీర్( Zairy Amir ) అనే 38 ఏళ్ల మలేషియా( Malaysia ) వ్యక్తి ఉద్యోగం కోసం చైనా వెళ్లాడు.
కొత్త ప్రదేశం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల గురించి అతనికి పెద్దగా తెలియదు.ఒకరోజు బట్టలు ఉతుక్కోవడానికి లాండ్రీ కోసం వెతుకుతూ దారి తప్పిపోయాడు.ఎవరిని అడగాలో తెలియక నిలబడి ఉండగా.సుఫియా( Sufiah ) అనే 40 ఏళ్ల యునాన్ ప్రావిన్స్‌కి చెందిన అమ్మాయి కనిపించింది.
జైరీ ఆమెను లాండ్రీకి దారి చూపించమని అడిగాడు.సుఫియా అతనికి సాయం చేసింది.
అక్కడితో మొదలైంది వీరిద్దరి అందమైన ప్రేమ కథ.
మొదట్లో ఇది ఒక చిన్న సహాయం అనుకున్నాడు జైరీ.కలిసింది కాసేపే కదా, మళ్లీ ఎక్కడ కలుస్తాంలే అనుకున్నాడు.కానీ విధి రాత వేరేలా ఉంది.
ఆ తర్వాత వాళ్లు తరచూ కలుసుకోవడం మొదలుపెట్టారు.సుఫియా ప్రతిరోజు జైరీ కోసం స్వయంగా వంట చేసి, అతని ఇంటి దగ్గరలోని సబ్‌వే స్టేషన్‌కు తీసుకొచ్చేది.
అలా వారి మధ్య బంధం మరింత బలపడింది.ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగింది.
రంజాన్ మాసంలో సుఫియా జైరీని ప్రత్యేక ప్రార్థనల కోసం తన ఇంటికి ఆహ్వానించింది.అంతేకాదు, తను, తన తల్లి కోసం తారావీహ్ ప్రార్థన చేయమని అమీర్‌ను అడిగింది.అమీర్ చాలా గౌరవంగా భావించాడు, కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ప్రార్థన చేయించలేదు కాబట్టి కొంచెం భయపడ్డాడు.
వాళ్లిద్దరి మధ్య అనుబంధం బలపడింది, త్వరలోనే వాళ్లు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఓరియంటల్ డైలీ న్యూస్ ప్రకారం అమీర్, సుఫియా వివాహం చేసుకున్నారు.వాళ్ల హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది, చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.