అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ..?

తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది.పౌర్ణమి సందర్భంగా ఈ నెల 31వ తేదీన అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి, టీఎస్ ఆర్టీసీ ఎండీ బిసి సజ్జనార్( VC Sajjanar) ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ సంగారెడ్డి డిపో నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేంద్ర వెల్లడించారు.

 Tsrtc Gave Good News To The Devotees Who Want To Circumambulate Arunachala Aruna-TeluguStop.com
Telugu Devotees, Devotional, Srivarasiddi, Tamil Nadu, Ts Rtc, Vc Sajjanar-Lates

ఈ సందర్భంగా సంగారెడ్డి డిపో మేనేజర్ మాట్లాడుతూ సర్వీస్ నెంబర్ 92233 బస్సు ఈ నెల 30న రాత్రి 7 గంటలకు సంగారెడ్డి నుంచి అరుణాచలం వాయ హైదరాబాద్ నుంచి అరుణాచలం బయలుదేరుతుందని తెలిపారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విగ్నేశ్వర దర్శనం, వేలూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం 31న రాత్రి 8 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని వెల్లడించారు.అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదిక్షణ పూర్తయిన తర్వాత ఆగస్టు 1న సాయంత్రం మూడు గంటలకు బయలుదేరి ఆగస్టు 2న ఉదయం శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం సన్నిధికి వెళుతుందని చెబుతున్నారు.

Telugu Devotees, Devotional, Srivarasiddi, Tamil Nadu, Ts Rtc, Vc Sajjanar-Lates

అక్కడ దర్శనం తర్వాత సంగారెడ్డికి అదే రోజు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుందని తెలిపారు.అరుణాచల గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీ లాగా టిఎస్ఆర్టిసి అందిస్తుందని, ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి నాలుగు వేలు అని సంస్థ నిర్ణయించిందని వెల్లడించారు.చార్జీలు, టోల్ టాక్స్, బోర్డర్ టాక్స్ కలుపుకొని టూర్ ప్యాకేజీగా అందిస్తున్నామని వెల్లడించారు.ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునేవారు సంస్థ అధికారిక వెబ్సైట్ tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని తెలిపారు.సంగారెడ్డి జిల్లా ప్రాంతాల వాళ్ళు తమ దగ్గర్లోని బస్టాండ్ టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ 9959226267, 7382831120, 9398690602 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube