కార్తీక శుద్ధ సప్తమి( Kartika Suddha Saptami ) ఏడవ రోజునీ ఒక విశిష్టమైన రోజుగా పండితులు చెబుతున్నారు.ఆ రోజు ఆర్థిక బాధలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ విధానాన్ని పాటించడం ఎంతో మంచిది.
ఈ కార్తిక శుద్ధ సప్తమి కార్తవీర్యార్జునుడీ జయంతి( Kartaveeryarjunudi Jayanti ).కార్తవీర్యార్జునుడు అంటే సహస్ర బాహువులతో మీ చేతులతో ఉండేటువంటి కృష్ణమూర్తి స్వరూపం అని కూడా చెబుతున్నారు.మన నష్ట ద్రవ్యానికి ఆయన దేవుడు.లాభం కావాలి అని అనుకున్నప్పుడు కార్తవీర్యార్జునుడీ జయంతి లో చూపించేటటువంటి నిశ్చల భక్తిశ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది.ఈ జయంతిలో భక్తితో మనము పూజలు చేస్తాము.కార్తవీర్యార్జునో పూజ వల్ల అంతటి చక్కని ఫలితాలు లభిస్తాయి.
కాబట్టి మీరు చేయవలసిందిగా కార్తీక శుద్ధ సప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేయాలి.అలాగే ఆరోగ్యం బాగా ఉన్నవారు ఉపవాసం చేయవచ్చు.శక్తి లేకపోతే ఉపవాసం చేయవలసిన అవసరం లేదు.మీరు ఉదయం పళ్ళు పాలు వంటివి తీసుకోవచ్చు.అంటే ఉడికిన ఆహారం కాకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి పళ్ళు, పాలు లాంటివి తీసుకోవచ్చు.సాయంకాలం ఐదు గంటలకి చక్కగా తలస్నానం కచ్చితంగా చేయాలి.
తలస్నానం చేసుకుని తులసి కోట( Tulsi ) దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని చేయాలి.తులసి కోట దగ్గర శుభ్రం చేసుకుని లక్ష్మీ పాదాలు వంటి ముగ్గులు వేసుకోవాలి.
వేసి అన్ని సిద్ధం చేసుకుని ఉంచాలి.ఇంకా చెప్పాలంటే చక్కని పూలతో తులసి కోటను అలంకరించి మట్టి ప్రమిదల లో మూడేసి వత్తులు వేసి 12 దీపాలు వెలిగించి విడివిడిగా వెలిగించాలి.
అంటే ఒక ప్రమిదలో మూడు దీపాలు వెలిగించాలి.అలాగే దానికి తగ్గట్టుగా ప్రమిదలు తెచ్చుకొని మీరు 12 దీపాలు తులసి కోట వద్ద పెట్టి పూజ చేయాలి.ఈ కార్యక్రమం చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు.అలాగే స్వామివారికి స్వామి నేను నీ పూజ నీ ఈ విధంగా చేస్తున్నాను.నాకు ఉన్న శక్తి ఇంతే అని ప్రార్థించాలి.కానీ భక్తిలో లోపం అస్సలు ఉండకూడదు.
సహస్ర బాహువైన నువ్వే నాకు దిక్కు ఇంకెవరూ లేరు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి.ఆరోజు పూజలో చెరుకు గడలు కూడా పెట్టాలి.
ఆ పూజలోనే 12 టెంకాయలు కొట్టి స్వామివారికి నివేదన చేయాలి.తర్వాత హారతి ఇవ్వాలి.
ఇలా చేయడం వల్ల మీ సమస్యలు వేగంగా దూరమైపోతాయి.
LATEST NEWS - TELUGU